Twitter: ట్విట్టర్ పేరు, లోగోను ఆ సంస్థ ఓనర్ ఎలాన్ మస్క్ మార్చారు. ట్విట్టర్ లోగో, పేరు మార్పును యూజర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. మిమ్స్ కూడా షేర్ చేస్తున్నారు. దీంతో మస్క్ స్పందించారు. పేరు మార్చడానికి గల కారణం వివరించారు.
ట్విట్టర్ పేరు ఎక్స్.. లోగో బ్లూ బర్డ్ ప్లేస్‌లో ఎక్స్ చేర్చారు. దీనిపై చర్చ జరగగా.. మస్క్ నోరు తెరిచారు. ట్విట్టర్‌ను సూపర్ యాప్‌గా మారుస్తానని. .అందుకే పేరు మార్చానని తెలిపారు. వాక్ స్వాతంత్య్రానికి గుర్తుగా ట్విటర్ పేరు మార్చాలని ఎక్స్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. అందులో భాగంగా పేరు మార్చాం అని.. పేరు మార్చడమే కాదు.. ఇకపై ట్విట్టర్ అదే పనిచేస్తోంది. ట్వీట్‌కు 140 అక్షరాల పరిమితి ఉన్న సమయంలో ట్విటర్ పేరు సరిపోతుంది.. ఇప్పుడు ఆ పేరు ఉండటంలో అర్థం లేదు. ప్రస్తుతం ఎక్స్‌లో ట్వీట్ మాత్రమే కాదు.. పెద్ద సైజ్ వీడియోలు కూడా షేర్ చేసే వెసులుబాటు ఉంది.
కొన్ని నెలలో ఎక్స్‌లో కీలక మార్పులు వస్తాయి. ఇకపై యూజర్లు తమ ఆర్థిక లావాదేవీల కోసం ఇతర యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ట్విట్టర్ ఎక్స్.. ఎవ్రిథింగ్ యాప్‌గా మారుస్తాం అంటున్నారు. ట్విట్టర్లో షేర్ చేసే కంటెంట్ ట్వీట్ అని పిలవాలా..? ట్వీట్‌కు బదులు కొత్తగా ఏదైనా పేరు ప్రకటిస్తారా..? అనే దానిపై స్పష్టత లేదు. ఎక్స్‌లో అడిషనల్ ఫీచర్ల కోసం కొత్తగా సబ్ స్క్రైబ్ చేసుకోవాలనే అంశంపై నెటిజన్స్ డిస్కషన్ చేస్తున్నారు.