Viral: Ananya Panday And Aditya Roy Kapur Watched Barbie Together
Ananya-Aditya: లైగర్ బ్యూటీ అనన్య పాండే, బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో ప్రేమలో ఉందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ జంట స్పెయిన్‌లో షికార్లు చేశారు. లవ్ కపుల్ సినిమా కోసం షికార్లు చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి బార్బీ మూవీ చూడటానికి వెళ్లారు. వీరు అభిమానుల కంటపడ్డారు. ఫోటోలు తీయడంతో కలిసి తిరుగుతున్నారని తెలిసింది.
స్పెయిన్‌లో విహారయాత్రకు వెళ్లారు. అనన్య, ఆదిత్య విడివిడిగా రాక్ కచేరీకి హాజరయ్యేందుకు స్పెయిన్ వెళ్లారట. ఇద్దరూ స్పెయిన్ సందర్శన గురించి తమ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో విడివిడిగా పంచుకున్నారు. కొంత కాలం క్రితం పోర్చుగల్ రాజధాని లిస్బన్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. ఓ మూవీలో ఆదిత్య రాయ్, అనన్య పాండే కౌగిలించుకొని ఉన్న ఫోటోలు బయటకు రావడం విశేషం. ఫోటోలు తీసిన వీరి అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఆదిత్య, అనన్య పాండే ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ జంట ఇప్పుడు బాలీవుడ్లో క్రేజీగా మారారు. ఇద్దరికీ 13 ఏళ్ల వయసు తేడా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ బాలీవుడ్లో ఈ కపుల్ హాట్ టాపిక్‌గా మారిందని చెప్పవచ్చు.