సముద్రఖని దర్శకత్వం వహించిన పవన్ కళ్యాణ్ బ్రో(BRO) జూలై 28, 2023న విడుదలవుతోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‌లోని శిల్పారామంలో సాయంత్రం 6 గంటల నుంచి జరుపుకోనున్నారు. ఈలోగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చే అతిథులపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ వేడుకకు యువ మెగా హీరోలు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారని సమాచారం. మరో వైపు బండ్ల గణేష్ కూడా వస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్(priya prakash varrier), కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. తమిళ చిత్రం వినోదయ సితంకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.