»Pratinidhi 2 Nara Rohit Is The Hero Of Pratinidhi 2 Movie Directed By Journalist Murthy
Pratinidhi2: యాత్ర 2కు పోటిగా..ప్రతినిధి2?
జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా ప్రతినిధి2 సినిమా ప్రకటించిన తరువాత తెరపైకి అనేక విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది కచ్చితంగా ఏపీ రాజకీయాలను ఉద్దేశించే తెరకెక్కించనున్నారని ఆరోపణలు మొదలయ్యాయి.
Nara Rohit is the hero of Pratinidhi 2 movie directed by journalist Murthy
Pratinidhi 2: వైవిధ్యమైన కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో నారా రోహిత్(Nara Rohit) చాలా గ్యాప్ తరువాత మళ్లీ సందడి చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సారి ఓ పొలిటికల్ థ్రిల్లర్(political thriller)తో..జర్నలిస్ట్‌గా రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం ఉన్న టీవీ5 మూర్తి(TV5 murthy) డైరెక్షన్లో ప్రతినిధి2 తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదల కావడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు పొలిటికల్ విశ్లేషకులలో కూడా చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్(Andrapradesh)లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సినిమా ప్రకటించడంపై కచ్చితంగా ఏపీ రాజకీయాలను ప్రతిబింబించేలా ఉంటుందని భావిస్తున్నారు.
అలాగే వైసీపీ ఫెవర్ గా యాత్ర 2(Yathra2), రామ్ గోపాల్ వర్మ(RamgopalVarma) ప్రకటించిన వ్యూహం రెండు సినిమాలు వస్తున్నట్లుగానే టీడీపీ(TDP)కి సపోర్ట్‌గా ప్రతినిధి2 తెరకెక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ఇటు సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాలో ఏ విషయంపై స్పందిస్తారు అనే విషయంపై ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఇక విడుదల చేసిన పోస్టర్ మొత్తం న్యూస్ పేపర్లతో డిజైన్ చేసిన హీరో నారా రోహిత్ కటౌట్ కనిపిస్తుంది. చూడాడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత నారా రోహిత్ ప్రేక్షకుల ముందు వస్తుండటం ఒకెత్తు అయితే ఎన్నికల ముందు సినిమా ప్రకటించడంతో మంచి బజ్ క్రియేట్ అయింది.
2014లో వచ్చిన ప్రతినిధి రోహిత్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయింది. కొన్నిరోజులుగా #NaraRohit19 సినిమా వస్తుందని ప్రచారం కొనసాగుతుంది. ఈ సందర్బంగా ఈ సినిమా పోస్టర్ తో పాటు విడుదల తేదీ కూడా ప్రకటించారు. ఈ సినిమాకు One man will stand again, against all odds అనేది క్యాప్షన్‌లా పెట్టారు. అంటే ఈసారి కూడా వ్యవస్థపై ఒక వ్యక్తి యుద్ధం చేస్తాడు అనేది సినిమా కాన్సెప్ట్ అని చెప్పారు. 2024 జనవరి 25వ తేదీన రిపబ్లిక్ డే వీకెండ్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుందని స్పష్టం చేశారు. వానర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గానూ, రవితేజ గిరిజాల ఎడిటర్‌గానూ వ్యవహరించనున్నారు.
జర్నలిస్ట్ మూర్తి(Journalist Murthy) ఆ మధ్య ప్లే బ్యాక్ అనే సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత డెరెక్ట్ మెగాఫోన్ పట్టడం విశేషం. అయితే వైసీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీకి ఫేవర్ గా తెరకెక్కుతుందని ప్రచారం పొందిన యాత్ర2 ఫిబ్రవరి 2024లో వస్తుండగా దాని కన్న రెండు వారాల ముందే ప్రతినిధి2 రిలీజ్ చేస్తుండడం కూడా విశ్లేషకులు పరిగణలోకి తీసుకుంటున్నారు.