Nara Rohith : ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీడీపీని ఆయన పరిధిలోకి తీసుకోవాలని ఆశించేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఆయన మాత్రం ప్రస్తుతం సినిమాల పై మాత్రమే ఫోకస్ పెట్టారు. కాగా.. ఆయన రాజకీయాల్లోకి వచ్చే విషయమై నటుడు నారా రోహిత్ స్పందించారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీడీపీని ఆయన పరిధిలోకి తీసుకోవాలని ఆశించేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఆయన మాత్రం ప్రస్తుతం సినిమాల పై మాత్రమే ఫోకస్ పెట్టారు. కాగా.. ఆయన రాజకీయాల్లోకి వచ్చే విషయమై నటుడు నారా రోహిత్ స్పందించారు.
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నారా రోహిత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైస్సార్సీపీ డెఫన్స్లో పడిందని.. అందుకే టీడీపీ పార్టీపై బురదజల్లుతున్నారని విమర్శించారు.
యువగళం పాదయాత్ర మున్ముందు ప్రభంజనం రేపుతుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అలాగే అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని నారా రోహిత్ చెప్పుకొచ్చారు.
నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో లేడు. గతంలో టీడీపీ తరుపున ప్రచారం చేసిన ఎన్టీఆర్..ప్రస్తుతం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా అందుకున్న ఎన్టీఆర్..ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన ఎన్టీఆర్ 30 వ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుపుకుంది.