లంచం తీసుకున్న ఓ ఉద్యోగి ఎదుట లోకాయుక్త అధికారులు కనిపించే సరికి ఏం చేయాలో తెలియక డబ్బులు మింగేశాడు. అది చూసిన లోకయుక్త అధికారులు షాక్కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Gajendra Singh, who works in the revenue department in Madhya Pradesh, was caught for bribery. He swallowed them to escape
Viral News: లంచం తీసుకుంటు రెవిన్యూ శాఖ(Revenue Department) అధికారి అడ్డంగా దొరికిపోయాడు. ఊహించని రీతిలో ఎదురగా అధికారులు కనిపించేసరికి ఆ డబ్బులను ఏం చేయాలో తెలియక మింగేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. గజేంద్ర సింగ్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కట్నీ నగరంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నాడు. ఓ పనికోసం అతని దగ్గరకు వచ్చిన వ్యక్తిని ఎప్పటి లాగే లంచం కింద పెద్ద మొత్తంలో డబ్బులు అడిగాడు. అంత ఇచ్చుకోలేనేనని సదరు వ్యక్తి చెప్పడంతో బేరం రూ. 5 వేలకు తెగ్గొట్టాడు. అధికారితో మంతనాలు అయిన తరువాత ఈ విషయాన్ని నేరుగా లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు ఆ వ్యక్తి.
దానిపై స్పందించిన అధికారులు గజేంద్ర సింగ్ లంచం తీసుకునేప్పుడు పట్టుకునేలా వల పన్నారు. దానిలో భాగంగా సింగ్కు చెందిన ప్రైవేటు కార్యాలయంలో సదరు వ్యక్తి నుంచి రూ.5వేలు తీసుకుంటుండగా అక్కడకి లోకాయుక్త అధికారులు(Lokayukta authorities) వచ్చారు. ఊహించని రీతిలో అధికారులు కనిపించేసరికి సింగ్ లో ఏం చేయాలో తెలియక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. డబ్బుతో సహా పట్టుపడొద్దు అని నిర్ణయించుకున్న గజేంద్ర వాటిని మింగేశాడు. చూస్తూ ఉన్న అధికారులు ఒక్కసారిగా షాక్కు గురి అయ్యారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు అతనికి ఏ ప్రమాదం లేదని చెప్పారు. సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
A patwari in Katni, allegedly swallowed money he had accepted as a bribe after noticing a team of the Lokayukta's Special Police Establishment pic.twitter.com/AgsOyDsnGM