»Nara Rohit Journalist Murthy Prathinidhi 2 Movie Review
Prathinidhi 2 Movie Review: ప్రతినిధి 2 మూవీ రివ్యూ
దేశంలో ఎన్నికల హీట్ ఉన్న నేపథ్యంలో పోలిటికల్ సినమా వస్తే ఆ ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా ఉంటుంది. మరీ ఈ సమయంలో రాజకీయాలను, జర్నలిజం బ్యాగ్‌డ్రాఫ్‌లో తెరకెక్కిన చిత్రం ప్రతినిధి2. జర్నలిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి నేపథ్యంలో రాజకీయ కోణంలో సినిమా వస్తుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో, నారా రోహిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ప్రతినిధి2(Prathinidhi 2 Review). గతంలో ప్రతినిధి చిత్రాానికి ఇది కొనసాగింపుగా రూపొందింది. ప్రచార చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ (నారా రోహిత్). ఆయన చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు చేతన్ ను జర్నలిజం వైపు మళ్లిస్తాయి. ఇక తాను ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తుంటాడు. అతన్ని ఎన్.ఎన్.సి ఛానల్ సీఈఓగా నియమిస్తుంది. అక్కడ జాయిన్ అయ్యాక రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలను బయటపెడుతాడు. తద్వారా రాజకీయ నాయకుల జీవితాలపై ప్రభావం పడుతుంది. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడేకర్)పై హత్యాయత్నం జరుగుతుంది. ఆ హత్య ప్లాన్ ఎవరు చేశారు. సీబీఐ పరిశోధనల్లో ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై జర్నలిస్టు పోరాటం ఎలాంటిది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న జర్నలిజం పవర్ ఏంటో చూపించే పాత్రలో నారా రోహిత్ కనిపిస్తాడు. సినిమాలో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినా ఇది కమర్షల్ ఫార్మెట్లో తెరకెక్కిన చిత్రం. ముఖ్యమంత్రి హత్య, తరువాత అతని కొడుకు పదవి చేపట్టాలనుకోవడం లాంటి సంఘటనలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. జర్నలిజం, రాజకీయ వ్యవస్థలు దేశ ప్రజలకు ఎంత ముఖ్యమో చాలా సన్నివేశాల్లో చెప్పారు. ప్రథమార్థంలో కలం పట్టిన హీరో ద్వితీయార్థంలో కత్తి పడుతారు. ఈ క్రమంలో చోటు చేసుకొనే మలుపులు, డ్రామా ప్రేక్షకుడిని కూర్చొబెడుతాయి.
సినిమా ప్రారంభంలోనే జర్నలిజం గొప్పతనాన్ని చూపించే పాత్రలో కథానాయకుడి పాత్ర ఎలాంటిదో అర్థం అవుతుంది. తరువాత ఎన్.ఎన్.సి ఛానల్లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత చిత్రం ఆసక్తిగా మారుతుంది. మంత్రి గజేంద్ర (అజయ్ ఘోష్) అరాచకాల్ని ప్రశ్నించడం, తద్వారా గజేంద్ర పదవి పోయేలా చేయడం, ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికలు, అందులో ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేసే నరసింహ (పృథ్వీరాజ్) గురించి అనేక నేరాలు వెలుగులోకి తీసుకురావడం ప్రేక్షకలకు ఆసక్తిని కలుగజేస్తాయి. ఈ సందర్భంగా ఓటు విలువని చెప్పే సన్నివేశాలూ చిత్రానికి బలం. అలాగే విశ్రాంతి సమయంలో ఉన్న ట్విస్ట్ ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతుంది. సినిమా అప్పటి వరకు చాలా సహజంగా ఉంటుంది. ఇక ద్వితీయార్థం నుంచి కథ చాలా సినిమాటిక్‌గా మారుతుంది. హీరో కుటుంబ నేపథ్యం, అతని లక్ష్యం, పాటలు, ఫైట్లు ఇలా తెలుగు కమర్షల్ సినిమానే గుర్తు చేస్తాయి. అయితే సీఎం హత్యాయత్నం వెనక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే:
ఇలాంటి ఇంటెన్స్ పాత్రలు చేయడంలో నారా రోహిత్ దిట్ట అని చెప్పవచ్చు. జర్నలిస్టుగా ఆయన కనిపించిన తీరు, ప్రశ్నించే విధానం బాగుంది. ఎమోషనల్ సీన్స్, ఫైట్స్‌లో తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సిరి లెల్లా ఉన్నంతలో నటించింది. సచిన్ ఖేడ్కర్, దినేశ్ తేజ్, జిషుసేన్ గుప్తా, అజయ్ ఘోష్, పృథ్వీరాజ్, ఉదయభాను పాత్రలు ఆకట్టుకుంటాయి.
సాంకేతిక అంశాలు:
నాని చమిడిశెట్టి కెమెరా పనితనం బాగుంది. మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం చిత్రానికి బలం. అలాగే సెకండ్ ఆఫ్‌లో ఎడిటింగ్ పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇక జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా మార్కులు వేసుకున్నారు. రక్తికట్టించే సీన్లతో కమర్షల్ సినిమా తెరకెక్కించారు. సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.