Holidays: వర్షాలు వస్తే సెలవులేనా? ప్రభుత్వ తీరులో మార్పు రాదా?
కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. వాతావరణశాఖ హెచ్చరికలతో మరోసారి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ ఇలా సెలవులు ఇస్తే విద్యార్థుల చదవుల పరిస్థితి ఎంటని ప్రశ్నిస్తున్నారు.
Holidays: తెలంగాణలో వర్షాలు వస్తే వరదలతో పాటు చదువుకునే పిల్లలకు సెలవులు(Holidays) కూడా బోనస్‌గా వస్తున్నాయి. వాతావరణశాఖ అలెర్ట్ చేయగానే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే హాలిడేస్ గురించి పిల్లలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు రోడ్లుమీద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యలు. ఇది కేవలం ఈ సంవత్సరం కాదు. ప్రతీ ఏడు ఇదే పరిస్థితి. మరీ దీనికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు అన్నదానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు వరదనీటిలో మునిగిపోతున్నాయి. వాటిని పట్టించుకునే నాథుడే లేడు. సెలవులు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందా అనేది ప్రభుత్వానికే తెలియాలి. అనేక ఇళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తప్ప ఈ సమస్యలకు ప్రభుత్వం మాత్రం పరిష్కార మార్గాలు ఆలోచించడం లేదు.
వాయువ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన అల్ప పీడనం ఇవాళ ఉదయం బలమైన అల్ప పీడనం(low pressure)గా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో తీవ్ర ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజులు పాటు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
దీంతో తెలంగాణ(Telangana) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు మరోసారి సెలవులు(Holidays) ప్రకటిస్తూ అదేశాలను విడుదల చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26, 27న విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశించారు. తెలంగాణలో వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ఈ నెల 20, 21, 22 తేదీల్లో సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మరోసారి విద్యాసంస్థల(Educational Institutions)కు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అసలే ఈ నెల బోనాల సెలవులు అని, ఆదివారం, సెకండ్ శనివారం అదనంగా ఈ 5 రోజులు సెలవులు. ఇక విద్యాంస్థల పనిదినాలు ఎన్ని రోజులు అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇలా వర్షాలు పడగానే సెలవులు ఇచ్చే బదులు పిల్లల చదువులు, భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తే బాగుంటుంది.
చదవండి:Twitter పేరు అందుకే మార్చాం.. మస్క్ ఏమన్నారంటే..?