»It Employees Logout In 3 Phases Avoid Traffic Jam
Traffic Jam తిప్పలు.. 3 దశల్లో లాగౌట్, పోలీసుల సూచనలు
హైదరాబాద్ హైటెక్ సిటీలో ట్రాఫిక్ తిప్పలు మాములుగా లేవు. వర్షం.. ఆపై ట్రాఫిక్‌తో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 3 దశల్లో ఉద్యోగులు విధులకు రావాలని సూచనలు చేశారు.
It Employees Logout In 3 phases, Avoid Traffic Jam
Traffic Jam: వారం, పది రోజుల నుంచి తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చినుకు పడితే చాలు విశ్వనగరి చిత్తడి అయిపోతుంది. ఇక హైటెక్ సిటీలో ట్రాఫిక్ (Traffic Jam) తిప్పలు మాములుగా ఉండవు.. నిన్న ట్రాఫిక్ స్తంభించి పోయిన సంగతి తెలిసిందే. అందుకోసం సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు, రేపు.. రెండు రోజులు ఐటీ కంపెనీలు షిప్ట్ మెయింటెన్ చేయాలని సూచించారు. దీంతో ట్రాఫిక్ తగ్గుతుందని చెబుతున్నారు.
మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కంపెనీలు లాగ్ ఔట్ సమయంపై కీలక సూచనలు చేశారు. మూడు దశలో ఉద్యోగులు లాగౌట్ కావాలని పేర్కొన్నారు. ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ కార్యాలయాలు మధ్యాహ్నం 3 గంటలు, ఐకియా నుంచి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు గల ఆఫీసులు సాయంత్రం 4.30 గంటల వరకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలిలో ఉండే ఐటీ కార్యాలయాల ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాగౌట్ చేయాలని కోరారు.
షిప్టుల వారీగా లాగౌట్ చేయడంతో ట్రాపిక్ తగ్గుతుందని పోలీసులు అంచనా వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కొందరు.. సాయంత్రం 4.30 గంటల వరకు మరికొందరు ఇంటికి వెళతారు. ఇక సాయంత్రం 6 గంటలకు ఐటీ ఉద్యోగులు అంతా ఇంటి బాట పడతారు. దీంతో ట్రాఫిక్ చిక్కులు ఉండవని పోలీసులు అంచనా వేశారు.