ఓ సూక్ష్మ చిత్ర కళాకారుడు తమ అభిమాన నాయకుడు చంద్రబాబు ఫోటోను గుమ్మడి గింజపై చెక్కాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటి వరకూ పెన్సిల్‌పై బొమ్మలు చెక్కడం, చాక్‌పీసులపై ఆర్ట్ వేయడం, వరి గింజపై పేర్లు చెక్కడం వంటివి చూసుంటాం. ఇప్పుడు ఏకంగా గుమ్మడి గింజ (pumpkin seed)పై తమ అభిమాన నాయకుడు, టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) బొమ్మను చెక్కాడు. ఆ బొమ్మను చంద్రబాబుకు కూడా చూపించగా ఆనందించారు. తెనాలికి చెందిన కళాకారుడు అవనిగడ్డ శివ నాగేశ్వరరావు (Avanigadda Shiva Nageswara Rao) ఈ అద్భుత కళాఖండాన్ని సృష్టించాడు.
అవనిగడ్డ శివ నాగేశ్వరరావు (Avanigadda Shiva Nageswara Rao) కువైట్‌లో ఉంటున్నాడు. అక్కడ చిత్ర కళా ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. సూక్ష్మ చిత్ర కళపై ఆయనకు పట్టు ఉండటంతో ఎవరూ చేయని విధంగా గుమ్మడి గింజల(pumpkin seed)పై తమ అభిమాన నాయకుడైన చంద్రబాబు ఫోటోను చెక్కాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఓ గుమ్మడి గింజపై చంద్రబాబు (Chandrababu) బొమ్మను చెక్కాడు.
తన కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు (Chandrababu)కు ఈ బహుమతిని అందించాడు. తను ఇప్పటి వరకూ చేసిన సూక్ష్మ చిత్ర కళా ఆల్బమ్‌ను చంద్రబాబుకు చూపించాడు. చంద్రబాబు ఆ కళాకారుడిని మెచ్చుకోవడతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. చంద్రబాబుతో సెల్ఫీ దిగి తెనాలి వచ్చాక తమ కుటుంబంతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం శివ నాగేశ్వరరావు (Avanigadda Shiva Nageswara Rao) చెక్కిన బొమ్మ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.