»Anju Marriage Is International Conspiracy Madhya Pradesh Minister
Anju పెళ్లి అంతర్జాతీయ కుట్ర: మధ్యప్రదేశ్ మంత్రి
పాకిస్థాన్ వెళ్లి, నస్రుల్లాను పెళ్లి చేసుకున్న అంజూ వ్యవహారం అంతర్జాతీయ కుట్ర అని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు.
Anju Marriage Is International Conspiracy: Madhya Pradesh Minister
Anju Marriage: మధ్యప్రదేశ్‌లో గల గ్వాలియర్‌కు చెందిన అంజూ నెలరోజుల వీసాపై పాకిస్థాన్ వెళ్లి.. అక్కడే తన స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన పేరును ఫాతిమాకు మార్చుకుంది. వారికి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని మొహసీన్ ఖాన్ అబ్బాసీ కొంత భూమి, నగదు కూడా ఇచ్చాడు. వారిద్దరు ఖైబర్ ఫక్తుంవా ప్రావిన్స్ అప్పర్ దిల్ జిల్లాలో ఉంటున్నారు. అంజుకు ఇదివరకే పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తకు విడాకులు ఇవ్వకుండానే పాకిస్థాన్ వెళ్లి, మరో పెళ్లి చేసుకుంది. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ విశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
అంజూ వివాహాం ఓ అంతర్జాతీయ కుట్ర అని నరోత్తమ్ మిశ్రా అన్నారు. అంజూను పాకిస్థాన్ ఆహ్వానించిన తీరు, ఆమెకు అందిన బహుమతుల గురించి సందేహాం వ్యక్తం చేశారు. కుట్రకోణం ఉందెమోనని అనుమాన పడ్డారు. అందుకే ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించామని వివరించారు. ఎంక్వైరీ రిపోర్ట్ బట్టి ఏం జరిగిందో తేలనుంది.
అంజూ తనకు ఇప్పటికీ విడాకులు ఇవ్వలేదని ఆమె భర్త చెబుతున్నాడు. పాప, బాబు ఉన్నారని.. పాపకు 15 ఏళ్లు అని.. బాబుకు ఆరేళ్లు అని తెలిపారు. అంజూ తండ్రి గయప్రసాద్ థామస్ మాట్లాడుతూ… ఆమె చేసిన పనికి సిగ్గు పడుతున్నానని తెలిపారు. పిల్లల కోసం కూడా ఆలోచించకుండా ఈ పనిచేసిందని మండిపడ్డారు. పాకిస్థాన్ వెళ్లాలి అనుకంటే. భర్తకు విడాకులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో అంజూ బతికి లేదని చెప్పారు.
లవ్ జిహాది, హానీ ట్రాప్ చేస్తుంటారు. అంజూది లవ్ జిహాది కిందకు వస్తోంది. భారత దేశంలో కీలక సంస్థలో ఉన్న ఉద్యోగులకు పాకిస్థాన్ హానీట్రాప్ చేసింది. ఆ విషయాలు ఇటీవల మనం వార్తల్లో చూశాం. ఇప్పుడు అంజూ వ్యవహారం చర్చకు వచ్చింది.