సీఎం కేసీఆర్ (CMKCR) అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్లో నిర్ణయించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన పంటల గురించి కూడా కేబినెట్ సమావేశం(Cabinet meeting)లో చర్చించినట్లు మంత్రి కేటీఆర్ (Minister KTR)వెల్లడించారు. వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు కేబినెట్ మీటింగ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి స్పష్టం చేశారు. దీంతో ఇకపై వారంతా ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సెషన్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లో రూ.60వేల కోట్లతో మెట్రో (Metro)విస్తరిస్తామని కేేటిఆర్ ప్రకటించారు. JBS-తూముకుంట, ప్యాట్నీ-కండ్లకోయ మార్గాల్లో డబుల్ డెక్కర్ మెట్రో నిర్మిస్తామన్నారు. మియాపూర్-ఇస్నాపూర్, మియాపూర్(Miyapur)-లక్షీ కాపూల్(మరో మార్గం), LBనగర్-పెద్ద అంబర్పేట, ఉప్పల్-BBనగర్, ఉప్పల్ ECIL, శంషాబాద్-కొత్తూర్, షాద్ నగర్, శంషాబాద్-కందుకూరు మార్గాల్లో మెట్రో విస్తరిస్తామని, 3-4ఏళ్లలో వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ (Mlc) అభ్యర్థులుగా శాసన మండలికి ఇద్దరు సభ్యులను ఎంపిక చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణ, డాక్టర్ దాసోజు శ్రవణ్ (Dasoju Shravan) శాసన మండలి అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసిందని వివరించారు. ఈ ప్రతిపాదనను వెంటనే గవర్నర్ పంపిస్తామని తెలిపారు.