Chandrababu will reduce the price of liquor in Nandyala's public meeting
Chandrababu: ఏపీలో రాజకీయాలు(AP Politics) హీట్ పెరుగుతున్న నేపథ్యంలో నంద్యాల(Nandyala) జిల్లా నందికొట్కూరు బహిరంగసభలో చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యపానం నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ (YCP) నిషేదం అటుంచి రకరకాల బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తుందని పేర్కొన్నారు. అలాగే వైన్ రేట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారని, ఇష్టం ఉంటే తాగండి లేదంటే వద్దు ప్రజల వీక్నెస్తో వ్యాపారం చేస్తూన్నారని పేర్కొన్నారు. నాసిరకమైన మద్యాన్ని అమ్మూతున్నారని విమర్షించారు. బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, బ్రిటీష్ ఎంపైర్, బ్లాక్ బస్టర్ వంటి విచిత్రమైన బ్రాండ్లను అమ్ముతున్నారని దుయ్యబట్టారు. ఈ నాసి రకం మద్యాన్ని తాగి ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక టీడీపీ (TDP) అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాల విషయంలో చాలా మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మద్యం ధరలను (Alcohol prices) తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామని తెలిపారు. 6 నెలలు ఓపికపడితే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు మారుతాయని నందికొట్కూరు బహిరంగసభలో చంద్రబాబు పేర్కొన్నారు.