»Mallareddy Spoke In Assembly He Will Decide The Candidates Of All Parties In Medchal Constituency
Mallareddy: ఐటీ అధికారులు డబ్బులు ఉన్న గదిని చూడలే
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటే అన్నారు మంత్రి మల్లారెడ్డి. అంతేకాదు తన ఇంట్లో డబ్బులు ఉన్న గదిని ఐటీ అధికారులు చూడలేదని, వాటినే వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
Mallareddy spoke in assembly. He will decide the candidates of all parties in Medchal Constituency.
Mallareddy: కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి(Mallareddy) మీడియాతో ఏ విధంగా మాట్లాడుతారో అందరికి తెలిసిందే. అలాగే అసెంబ్లీలో(Assembly) కూడా ఆయన అలానే వ్యవహరిస్తుంటారు. టీఎస్ ఆర్టీసీ(TS RTC)ని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటే అన్న మంత్రి.. ఇప్పుడు శాసనసభలో మరో వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వర్షకాల అసెంబ్లీ సమావేశాలు (Monsoon assembly meetings) మొదలయ్యాయి. అందులో భాగంగా ఐటీ అధికారులు తన ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదని, వాటినే తాను ఎన్నికలకు ఖర్చు చేస్తున్నానని మల్లారెడ్డి చెప్పారు. అలాగే టికెట్ చర్చపై స్పందిస్తూ.. మేడ్చల్ నియోజకవర్గంలో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను తానే నిర్ణయిస్తానని కామెంట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు అభ్యర్థిగా ఉండాలో తానే నిర్ణయిస్తానని అన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్కు టికెట్ ఇప్పించింది తానేనని చెప్పారు. మేడ్చల్ కాంగ్రెస్లో గ్రూప్ గొడవలు తామే సృష్టిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంలో తనకు స్నేహితులు ఉన్నారని, రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తరువాతే తన గ్రాఫ్ పెరిగిందని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసి విలీనంపై మీడియాతో మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంగా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని ఎన్నికల స్టంట్గా చూడాలా అని ఓ విలేకరి అడిగారు. దానికి సమాధానంగా అవును ఎన్నికల స్టంటే అనుకో అని, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ అని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఎన్నికల స్టంట్ కూడా ఉంటదని వివరించారు. ఎన్నికల స్టంట్ అయితేనేం ఆర్టీసీ కార్మికుల న్యాయం జరిగిందా లేదా అంటూ తిరిగి ప్రశ్నించారు. వాళ్లు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అయిండ్రు కదా దానికి అందరం సంతోషించాలి అన్నారు.