»Film Celebrities Against Question Kothwalguda Aqua Marine Park To Be Heard In High Court August 4th 2023
Aqua Marine Park:కు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు..రేపు హైకోర్టులో విచారణ
హైదరాబాద్(hyderabad) శివార్లలోని కొత్వాల్‌గూడలో ప్రతిపాదిత ఆక్వా మెరైన్ పార్క్(Aqua Marine Park)ను నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు నటీనటులు శ్రీదివ్య, రేణు దేశాయ్ సహా పర్యావరణవేత్తలు వేసిన పిటిషన్‌పై స్పందించాలని తెలంగాణ హైకోర్టు(High Court) మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం పర్యావరణ పరిరక్షణకై పోరాడటం అనేది అందరి బాధ్యత. ఆ బాధ్యతను స్వచ్చందంగా చేపట్టి పోరాడుతున్నారు కొందరు సినీప్రముఖులు. రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్ గూడ(kothwalguda)లో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్(Aqua Marine Park) కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్ పర్యావరణానికి పెద్ద ముప్పు కాబోతుందని సినీ నటులు రేణూదేశాయ్, శ్రీదివ్య, దర్శకుడు శశికిరణ్ తిక్కాతోపాటు మరికొందరు ప్రముఖులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఏటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ అక్వా మెరైన్ పార్క్ నిర్మాణం ఆపివేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇటువంటి పార్క్ ల నిర్మాణం సింగపూర్, మలేసియా వంటి దేశాలలో జరిగాయి. మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని కోర్ట్ ప్రశ్నించింది. అయితే వీటికి సమాధానంగా పిటీషనర్ తరపున న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపించారు.
ఎటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటుచేసే ఈ పార్క్ లతో జలచరాలకు, వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం(High Court) ప్రభుత్వానికి, HMDAలకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారంజీలు ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుంది.
ఈ సందర్భంగా పిటీషనర్స్ లో ఒకరైన దర్శకుడు శశికిరణ్ తిక్కా(sashi kiran tikka) మాట్లాడుతూ పర్యావరణానికి చేటు చేసే విధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ పై తాము చేస్తున్న ఈ పోరాటంకు ప్రజల మద్దతు కూడా కావాలన్నారు. వేలాది జలచరాల మనుగడకు దీని ద్వారా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఆక్వా మైరైన్ పార్క్ లు పర్యావరణాన్ని దెబ్బ తీస్తాయని వెల్లడించారు. వాటిని ఆహ్లాదం కోసం మనముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా చనిపోతాయని గుర్తు చేశారు. కృత్రిమంగా ఏర్పాటు చేసిన లైట్స్ లో వాటి జీవనం అత్యంత బాధాకరంగా మారుతుందన్నారు. వేల గ్యాలన్ల నీటితో నడిచే ఈ ఆక్వా పార్కులు నీటి సమస్యకు కారణం అవుతాయని అన్నారు. ఇలాంటి పార్కుల నిర్మాణాలు చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నటి సదా(sadha) మాట్లాడతూ ఇప్పటికే నగరంలో నీటి సమస్య చాలా ఉంది. ఈ నేపథ్యంలో మూడు వేల గ్యాలన్ల నీటితో నిర్మాణం అయ్యే ఇలాంటి ఆక్వా పార్కులు నీటి సమస్యను మరింత పెంచుతాయని ఆమె అన్నారు. సహాజంగా సముద్రాలలో పెరిగే జలచరాలును పట్టి కృత్రిమంగా నిర్మాణం అయ్యే ఇలాంటి పార్కులలో ఉంచడం వాటి ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు. వాటిని పట్టి తెచ్చే ప్రక్రియలోనే చాలా జలచరాలు ప్రాణాలు కోల్పోతాయని వెల్లడించారు. ఇలాంటి పార్క్ లు కాకుడా పర్యావరణంపై అవగాహాన పెంచే పార్కులను HMDA ఏర్పాటు చేస్తే మంచిదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.