»Minister Ktr Made Interesting Comments On Elections
KTR: ఎప్పుడూ మందు పోయలే, పైసలు పంచలే, దయ ఉంటే మళ్లీ గెలుస్తా
మంత్రి కేటీఆర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు తాను ఎప్పుడూ మందు పోయలే, పైసలు పంచలేదని తెలిపారు. ప్రజల దయ ఉంటే మళ్లీ గెలుస్తానని చెబుతున్నారు.
Minister KTR Made Interesting Comments On Elections
KTR: తెలంగాణ ఎన్నికల వేడి మెల్లిగా కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు అధికార కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడేస్తున్నారు. వచ్చే ఎన్నికలు, గెలుపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ (KTR) మాట తీరులో కొంచెం మార్పులు వచ్చినట్టు కనిపిస్తోంది. మరోసారి సిరిసిల్ల నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతారు. ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానో లేదోననే భయం వెంటాడినట్టు కనిపిస్తోంది. అందుకే ఇటీవల కేటీఆర్ (KTR) మాట్లాడిన మాటల్లో గెలిస్తే అంటూ మాట్లాడటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది.
దయ ఉంటే గెలుస్తా..?
అధికార కార్యక్రమాలకు వెళుతున్నారు.. ఆశీర్వదించండని కేటీఆర్ (KTR) అంటున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రోజు 600 బీసీ బంధు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నికల గురించి మరోసారి తీశారు. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తాను.. లేదంటే లేదన్నారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తాను ఎప్పుడూ ఓట్ల కోసం మందు పోయానని.. పైసలు పంచనని కేటీఆర్ స్పష్టంచేశారు. గతంలో ఎప్పుడూ మందు పోసి, పైసలు ఇవ్వలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా సరే ప్రజలకు సేవ చేస్తానని వివరించారు.
పెన్షన్ రాకున్నా హైలైట్
జనాలకు మంచి చేయాలని అనిపించి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని కేటీఆర్ (KTR) అంటున్నారు. ఏ ఒక్కరికీ పెన్షన్ రాకున్నా హైలెట్ అవుతుందని వివరించారు. రాష్ట్రంలో 12 లక్షల మందికి కల్యాణలక్ష్మీ ఇచ్చామని తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా 9 రకాల పథకాలను అమల్లోకి తీసుకొచ్చామని వివరించారు. బీసీలకు ఇచ్చే బీసీ బంధు అంటే లోన్ కాదని.. ప్రభుత్వం ఇస్తోన్న గ్రాంట్ అని వివరించారు. ఆ మొత్తం తిరిగి కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు.
మారిన సిరిసిల్ల రూపురేఖలు
సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా కేటీఆర్ (KTR) విజయం సాధించారు. వచ్చే ఎన్నికలతో నాలుగోసారి బరిలోకి దిగుతారు. కేటీఆర్ ఇంట్రెస్ట్ తీసుకోవడంతో సిరిసిల్ల రూపు రేఖలు సమూలంగా మారిపోయాయి. జిల్లాగా కూడా మారింది. 2009లో కేవలం 200 లోపు ఓట్లతో కేటీఆర్ బయటపడ్డారు. 2014, 2018లో మాత్రం మెజార్టీ పెరిగింది. ఈ సారి కూడా మంచి మెజార్టీ వస్తుందని కేటీఆర్ అనుచరులు అంటున్నారు. మంత్రికి మాత్రం ఎక్కడో సందేహాం ఉన్నట్టుంది.. అందుకే గెలిస్తే అంటున్నారు. ఇలా అనడం వెనక కూడా ఏదో మతలబు ఉందని.. ఆ వర్గం ఓట్లు లక్ష్యంగా కామెంట్స్ చేశారని అనేవారు ఉన్నారు.