»No Confidence Motion In Parliament August 7th 2023 Will Rahul Comments Attack Modi
No confidence motion: నేడు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం..రాహుల్ ఎటాక్ చేస్తారా?
కేంద్ర ప్రభుత్వంపై..ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం(No confidence motion) ఎందుకు ప్రవేశపెట్టింది? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఇండియా కూటమి ఏం సాధిద్దామని అనుకుంటుంది? పార్లమెంట్లో జరిగే చర్చలో ఎటువంటి వ్యూహంతో వ్యవహరించనుంది? లోక్సభ సభ్యత్వం తిరిగి పొందిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ చర్చలో బీజేపీపై విరుచుకపడనున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
మణిపూర్ అంశంపై లోక్సభలో(Parliament) అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా నేడు(ఆగస్టు 8న) రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఛార్జ్కు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ(modi) ఈరోజు పార్లమెంట్లో రెండోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనున్నారు. ఇది రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిది. దీంతో జూన్లో కాంగ్రెస్ అధినేత పర్యటించిన మణిపూర్లో జరిగిన హింసాకాండపై రాహుల్ గాంధీ(rahul gandhi) పార్లమెంటులో ఏం చెబుతారనేది పలువురు నేతల్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు లోక్సభ ఎంపీగా తన సభ్యత్వాన్ని పునరుద్ధరించిన నాలుగు నెలల తర్వాత రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంటుకు తిరిగి వస్తున్నారు.
అయితే మణిపూర్(manipur) రాష్ట్రంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు కేంద్రం సరైన రీతిలో స్పందించడం లేదని ఇండియా కూటమి గత కొంత కాలంగా విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై కూటమి నాయకులు మండిపడుతున్నారు. మణిపూర్ విషయంలో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి నేతలు ఎన్ని రకాలుగా మొర పెట్టుకుంటున్నా..సరైన స్పందన రావడం లేదని భావించిన ఇండియా కూటమి..కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు అందించింది. కూటమి సభ్యులు ఇచ్చిన నోటీసును పరిశీలించిన స్పీకర్ ఓం బిర్లా కొన్ని రోజుల తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరించారు. తేదీని ఖరారు చేశారు. ఆగస్టు 8, ఆగస్టు 9వ తేదీల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని నిర్ణయించారు.
ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం(No confidence motion)పై నేడు పార్లమెంట్లో చర్చ ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ చర్చలో ఏం జరగనుందనే విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అవిశ్వాస తీర్మానంపై ఏ ఏ పార్టీలు పాల్గొంటున్నాయి. ఆయా పార్టీలకు స్పీకర్ ఎంత సమయం కేటాయించారనే విషయాన్ని లోక్సభ సచివాలయం వెల్లడించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అవిశ్వాస తీర్మానంపై మొత్తం 12 గంటల పాటు చర్చ జరగనుంది.
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో రాహుల్ గాంధీ(rahul gandhi) స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో లోక్సభ సభ్యత్వం తిరిగి సంపాదించుకున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఎటాక్ చేయనున్నారు. అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. రాహుల్ గాంధీ చేసే ప్రసంగం గురించి దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
అవిశ్వాస తీర్మానంపై 12 గంటల పాటు జరిగే చర్చలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి గంటా 10 నిమిషాలు కేటాయించారు. బీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ, శివసేన, జేడీయూ, బీజేడీ, బీఎస్పీ, ఎల్జేపీ వంటి పార్టీలకు మొత్తంగా కలిపి 2 గంటల సమయం కేటాయించారు. ఇతర పార్టీ నేతలకు, స్వతంత్ర ఎంపీలకు 70 నిమిషాలు కేటాయించారు. విపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఏడు గంటల సమయం(time) కేటాయించినట్లు తెలుస్తోంది.