రెమ్యునరేషన్ (Remuneration) గురించి ఎందుకు? హోదా గురించి మాట్లాడండి అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. కొన్నేళ్లుగా తటస్థంగా ఉంటున్న ఆయన.. ఇప్పుడు తమ్ముడు పవన్‌కు (Pavan) డైరెక్టుగా సపోర్టు చేయడానికి సిద్ధమవుతున్నారని విశ్లేషకుల అంచనా. అందుకే తమ్ముడి వ్యాఖ్యలను తన నోట చెప్పారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తే బాగుంటుందని జనసేన (Janasena) శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి – రవితేజ నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య(Waltheru Veeraya)” సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా… జరిగిన వేడుకలో చిరంజీవి (Chiranjeevi) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ప్రత్యక్షంగా ఏపీ సర్కార్ పైనా.. పరోక్షంగా మంత్రి అంబటి (Minister ambati) రాంబాబుపైనా స్పందించారనే కామెంట్లు వినిపించాయి.అవును… “యాక్టర్ల రెమ్యునరేషన్ (Remuneration) పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి.. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి.. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారన్నారు. తాజాగా ఈ విషయంపై మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు! సినిమా ఇండస్ట్రీ(Film industry)లో చాలామంది పకోడీగాళ్లు ఉన్నారని.. వాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని అన్నారు.