»Kcrs Meeting With Maharashtra Leaders The Opposition Is Criticizing
KCR: తెలంగాణ అభివృద్ది లేదు, జాబ్స్ లేవు..దేశాన్ని పరుగులు పెట్టిస్తాడా?
బీఆర్ఎస్ భవన్లో మహారాష్ట్ర నేతలతో కేసీఆర్(KCR) సమావేశం సందర్భంగా ఆ రాష్ట్ర అభివృద్దిపై ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణతో పొలిస్తే మహారాష్ట్రా వెనకబడింది అన్నారు. ఈ మాటలపై ప్రతిపక్షాలు విమర్షలు గుప్పిస్తున్నారు. ముందు తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులేంటో చెప్పమని నిలదీస్తున్నారు.
KCR: తెలంగాణ ఉద్యమం విజయంతమై సాధించుకున్న తెలంగాణ(Telangana)లో మొదటి సార్వత్రిక ఎన్నికల(Elections) ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఒక నినాదాన్ని ఎత్తుకున్నాడు. తల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజు కొనిస్తానన్నాడట..అన్ని నియోజక వర్గాలలో ఘంటాపథంగా చాటింపు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే నినాదాన్ని ఆయనకు ఆపాదిస్తున్నారు ప్రతిపక్షాలు(Opposition parties). కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్దిని వదిలేసి దేశంలో రాజకీయం చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. పేరుకే బంగారు తెలంగాణ(Bangaru telangana) అని, అభివృద్ది ఏమోకాని నిజానికి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్షిస్తున్నారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్లో మహారాష్ట్ర(Maharastra) నాయకులతో జరిగిన మీటింగ్‌లో భాగంగా ఆ రాష్ట్ర అభివృద్ది విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai) నగరంలో నదులు, సహజ వనరులు ఉన్నప్పటికీ మహారాష్ట్రలో ప్రజలకు కనీసం తగినన్ని మంచినీళ్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. నీటి కోసం మహిళలు తాళ్లతో బావుల్లోకి దిగాల్సిన దుస్థితి ఎందుకు ఉందో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలన్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు హైదరాబాద్(Hyderabad)కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. దేశంలో పుష్కలమైన నీటి వనరులు, వర్షపాతం ఉన్నప్పటికీ తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనూ పరిపూర్ణ తాగునీటి వ్యవస్థ లేదని వెల్లడించారు. జల వనరులు ఇలాగే సముద్రాల్లో కలుస్తుంటే చూస్తూ ఊరుకుందామా అన్నారు. దీనికోసం అందరు సంఘటితమై ఉద్యమించాలన్నారు.
మహారాష్ట్రలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగాలంటే రైతు బంధు(Rhythu Bandu),రైతు బీమా (Rhythu Bheema), ఉచిత విద్యుత్ వంటి తెలంగాణ తరహా పథకాలు కావాలని ఔరంగాబాద్ డివిజన్ కమిషనర్, ఐఏఎస్ అధికారి కేంద్రేకర్ ప్రభుత్వానికి సూచిస్తే ఆయనను రాజీనామా చేయించారన్నారు. మహారాష్ట్రలో పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలను అందించడం లేదని, తెలంగాణలో లీటరు రూ.4 ఇస్తున్నామని అలాగే ఇక్కడ రైతులకు ఉచిత కరెంట్ ఉండడంతో వారు సంతోషంగా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు అని అన్నారు. మహారాష్ట్రను ఇప్పటి వరకు పాలించిన కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ రాష్ట్రాన్ని ఏ మాత్రం అభివృద్ది చేయలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే రెండేళ్లలో తెలంగాణలా మారుస్తామన్నారు.
రాష్ట్రంలో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా పక్కరాష్ట్రాల ప్రాబ్లమ్స్‌ను తీరుస్తాననడం..గూట్లే రాయి తీయలేనోడు ఏట్లే రాయి తీసినట్లే ఉందని ఎద్దేవా చేస్తున్నారు. పేరుకే డబుల్ బెడ్రూం ఇళ్లని, ఇప్పటి వరకు అవి అర్హులకు మంజూరు చేయలేదని మండిపడుతున్నారు. 24 గంటల కరెంట్ అని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్(KCR) సర్కార్ ధన్యం కొనుగోలు విషయంలో జరిగే నాటకీయ పరిణామాలను గుర్తుచేస్తున్నారు. ముందు తెలంగాణను అభివృద్దిపథంలో నడిపించేది పోయి..ప్రగల్భాలు పలుకుతున్నాడని ప్రతిపక్షాలు విమర్షలు గుప్పిస్తున్నాయి.