గత కొన్ని రోజులుగా టాలీవుడ్ అండ్ ఏపీ రాజకీయాల మధ్య వాదనలు, ప్రతివాదనలు జరుగుతూ హాట్ టాపిక్ గా మారిపోయాయి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి – రవితేజ నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య(Waltheru Veeraya)” సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా… జరిగిన వేడుకలో చిరంజీవి (Chiranjeevi) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా ఏపీ సర్కార్ పైనా.. పరోక్షంగా మంత్రి అంబటి (Minister ambati) రాంబాబుపైనా స్పందించారనే కామెంట్లు వినిపించాయి.అవును… “యాక్టర్ల రెమ్యునరేషన్ (Remuneration) పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి.. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి.. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు.
అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి..” అని చిరంజీవి స్పందించారు. తాజాగా ఈ విషయంపై మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు! సినిమా ఇండస్ట్రీ(Film industry)లో చాలామంది పకోడీగాళ్లు ఉన్నారని.. వాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని అన్నారు. ఈ సమయంలో వాళ్లకు కూడా.. సర్కార్ గురించి మనకెందుకురాబాబు” అని సలహాలు ఇవ్వొచ్చు కదా అని సూచించారు. మనం డాన్స్ లు, ఫైట్స్, యాక్షన్ (Action) గురించి చూసుకుందామని చెప్పొచ్చు కదా అని కౌంటర్ ఇచ్చారు. కేవలం ఒక్క ప్రభుత్వానికే కాకుండా… ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని కొడాలి నాని (Kodali Nani) అన్నారు.దీంతో… ఏపీ ప్రభుత్వం ఏమి చేయాలో, ఎలాంటి కార్యక్రమాలు చేయాలో, ఏయే విషయాలపై దృష్టి సారించాలో చెబుతూ తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ పడిపోయిందని అంటున్నారు.