KCR Bhima- Prati Intiki Dhima kcr announce New Scheme
KCR: తెలంగాణ గట్టు మీద అసెంబ్లీ ఎన్నికల వేడి తగిలింది. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ ఉందని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి గత నెలలో ప్రకటించాల్సి ఉంది.. అధిక శ్రావణ మాసం కావడంతో గులాబీ దళపతి ఆగారు అనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ నెల 12వ తేదీ.. లేదంటే 13 లేదంటే 17వ తేదీన అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ (cm kcr) ప్రకటిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
80 నుంచి 87 మంది సభ్యుల జాబితా ఇప్పటికే సిద్దమైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరిలో అందరూ సిట్టింగులేనని తెలుస్తోంది. తనతో కలిసి నడిచిన వారందరికీ మరోసారి అవకాశం ఇస్తానని కేసీఆర్ (KCR) ఇదివరకే స్పష్టంచేశారు. సో.. 87 మంది సిట్టింగులే ఉండే అవకాశం ఉంది. సిట్టింగుల్లో కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు (vanama), ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ (koppula eshwar), వేములవాడలో చెన్నమనేని రమేశ్ బాబుకు (chennamaneni ramesh babu) ఇబ్బంది కర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రమేశ్ బాబుపై అనర్హత వేటు అంశం ఉండగా.. వీరిపై ఎమ్మెల్యేగా తప్పుడు అఫిడవిట్ నమోదు చేశారని హైకోర్టులో కేసులు ఉన్నాయి.
అలా కొన్ని చోట్ల తప్పితే.. మిగతా అన్నీ చోట్ల మాత్రం సీట్లు కన్ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల మాదిరిగానే.. కనీసం 3 నెలల ముందుగా ప్రజల ముందుకు వెళ్లాలని అభ్యర్థులకు కేసీఆర్ (KCR) స్పష్టంచేశారు. దీంతో గత 2 నెలల నుంచి క్యాండెట్స్ అందరూ నియోజకవర్గాల్లోనే ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది.
బీఆర్ఎస్ దూకుడుగా అడుగులు వేయగా.. కాంగ్రెస్ (congress) కూడా తగ్గేదెలే అంటోంది. ఈ నెల చివరి వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెబుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన తర్వాత ఉంటుంది. ఫస్ట్ లిస్ట్‌లో 35 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని ప్రకటించింది. ఆ రెండు పార్టీల తర్వాత బీజేపీ కూడా ఫస్ట్ లిస్ట్ రెడీ చేస్తామని ఇండికేషన్స్ ఇచ్చింది.