»Telangana Government Brs Party Is Grulahakshmi Scheme An Election Strategy
BRS: గృహలక్ష్మీ కూడా ఎన్నికల స్టంటేనా ?
ఎన్నికల్లో గెలవడానికి గతంలో ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి చేయకముందే..మళ్లీ కొత్తవి ప్రకటిస్తున్నారు. కొత్త హామీలను చూసి ప్రజలు ఆశపడి ఓటేసి భంగపడడం పరిపాటి అయిపోయింది. అలాగే గృహలక్ష్మీ కూడా మరో దలితబంధు కాబోతుందా అనే అనుమానాలకు తావిస్తోంది. ఆ వివరెలెంటో ఇప్పుడు చుద్దాం.
Telangana government, BRS party, Is Grulahakshmi scheme an election strategy?
BRS: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఏర్పడిన తరువాత అనేక హామీలు(Guarantees) ఇచ్చింది. అందులో ఎన్ని నెరవేరాయో, ఎంత వరకు నెరవేరాయో చూస్తూనే ఉన్నాము. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పూర్తి కానేలేదు. ఉప ఎన్నికలప్పుడు కొత్త పథకాలు ఇస్తారు. సరే అవి అన్న సక్రమంగా పూర్తి చేస్తారా.. అంటే అదీ ఉండదు. ఈ నేపథ్యంలో మొదట డబుల్ బెడ్రూమ్స్(Double bedrooms) అన్నారు. ఇప్పటి వరకు అవి లబ్ధిదారులకు అందలేదు. తాజాగా గృహాలక్ష్మి స్కీం(Griha Lakshmi Scheme) అన్నారు. ఇక దీనికి తలా తోక అనేదు లేదని ప్రతిపక్ష పార్టీ సభ్యులు అంటున్నారు. ఎవరు అర్హులు, వాళ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారో తెలియదు. అంతే కాకుండా దరఖాస్తు చేసుకోవడానికి గడువు సమయం ఉండదు. మళ్లీ అందులో గందరగోళం. తాజాగా సింగరేణి ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు మరో చిక్కుప్రశ్న కొత్తగా వెలుగులోకి వచ్చింది. అప్లికేషన్లో స్థలం రిజిస్ట్రేషన్ పేపర్ కచ్చితంగా జత చేయాలి. ఈ నిబంధనతో సింగరేణి పరిసర ప్రాంతం వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి, నస్పూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లోని ఖాళీ స్థలాలపై స్థానికులకు ఎలాంటి యాజమాన్యపు హక్కులు లేవు. దీంతో గృహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. రాష్ట్ర సర్కార్ సింగరేణి ఖాళీ స్థలాల్లో (సింగరేణి ప్రభుత్వానికి సరెండర్ చేసిన ప్రాంతాల్లోని) ఇండ్ల నిర్మాణాలు చేసుకున్న వారికి పట్టాలు అందించింది. సింగరేణేతర మున్సిపాలిటీలు, పంచాయతీల్లో జీవో నంబర్ 58 ద్వారా 125 గజాలలోపు ఉన్న అసైన్డ్ స్థలాలను క్రమబద్ధీకరించారు. అంతకు ఎక్కువ ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి జీవో నంబర్ 59 ప్రకారం మార్కెట్ రేట్ చెల్లించాలని సర్కార్ ఛాన్స్ కల్పించింది. మున్సిపాలిటీల్లో భూముల అధికంగా ఉండటంతో క్రమబద్దీకరణకు ఎవరూ ముందుకు రాలేదు.
ఆర్థిక స్థోమత లేక చాలా మంది స్థలాలను ఖాళీగా ఉంచుతున్నారు. ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, ఇంటి నెంబర్, కరెంటు మీటర్, సాదాబైనామా, నోటరీ, రేషన్ కార్డు తదితర అంశాలను స్థల రిజిస్ట్రేషన్ కింద పరిగణలోకి తీసుకొని గృహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే సడలింపు ఇవ్వాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. దీనికి తోడు ఈ నెల 7 నుంచి 10 వరకు కేవలం మూడు రోజుల మాత్రమే దరఖాస్తుకు గడువు ఇవ్వడంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది.
నిజానికి ప్రజలు మేలు చేేసే పథకమే అయితే దరఖాస్తు గడువు అంత తక్కువ రోజుల పెట్టడం ఏంటని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం సేవా చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్‌కు ప్రత్యమ్నాయం తీసుకురావాలని, గడువు సమయం పెంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని అర్జిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పిందిస్తుందో చూడాలి.