»Former Bihar Chief Minister And Rashtriya Janata Dal Chief Lalu Prasad Yadav Is Currently Being Trolled On Social Media
Lalu Prasad Yadav: వీడియో తెగ ట్రోలింగ్..చూస్తే నవ్వేస్తారు!
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురించి ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. గతంలో ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధిని అన్న మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Former Bihar Chief Minister and Rashtriya Janata Dal chief Lalu Prasad Yadav is currently being trolled on social media.
Lalu Prasad Yadav: బిహార్(Bihar) మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(Rashtriya Janata Dal) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. అయితే అది ఇప్పటి విషయం కాదు. గతంలో మంచి మెజారిటీతో గెలిచిన సందర్భంగా ప్రముఖ న్యూస్ ఛానెల్ ప్రతినిధి తనతో మాట్లాడించారు. ఆ సందర్భంగా ఆయన తన గెలుపు గురించి మాట్లాడుతూ.. బిహార్‌లో బ్రదర్స్ పాలన ఉంటుందని, కాంగ్రెస్, జనతాదళ్ యూనైటెడ్, రాష్ట్రీయా జనతాదళ్ మూడు పార్టీలు కూటమిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గెలిచిన తర్వాత వెంటనే ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా లాలూ రిపోర్టర్ కు ధన్యవాదాలు చెబుతాడు. వెంటనే లాలు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరు బ్రేవ్ లేడీ అని.. నాట్ లేడీ యూ ఆర్ మేల్ అంటారు. దానికి అందరు నవ్వుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉండడంతో తన కొడుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను ఈ సంవత్సరం ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అనేది ప్రజల్లో ఆసక్తిగా మారింది. ఇక 17 ఏళ్ల నాటి దాణా కుంభకోణం కేసులో లాలూ జైలు జీవితం గడిపి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిగా బిహార్‌ను పాలిస్తున్న జనతాదళ్ రాబోవు ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తుంది.