Pawan Kalyan: బంగారు నగల కోసం విశాఖలో వృద్దురాలిని వాలంటీర్ హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పరామర్శించారు. ఆ ఘటనకు సంబంధించి వృద్ధురాలి బంధువులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వివరిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ వీడియోను క్లిక్ చేసి చూడండి. మాజీ వాలంటీర్ వెంకటేష్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మీ కుటుంబ సభ్యులను శనివారం పవన్ కల్యాణ్ పరామర్శించారు. జగన్ ప్రభుత్వం నవరత్నాల కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ సైన్యం ప్రజల ప్రాణాలు తీస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.
దండుపాళ్యం బ్యాచ్‌కు వాలంటీర్లకు తేడా లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. నగల కోసం వృద్దురాలిని కిరాతకంగా హత్య చేశాడని మండిపడ్డారు. ఇంత జరిగినా ఒక్క వైసీపీ నేత కూడా ఇంటికి వచ్చి పరామర్శించలేదని వివరించారు. అతను ఇంకా వాలంటీర్‌గా పనిచేస్తున్నాడని.. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం చేయడం లేదని అంటున్నారని వృద్దురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు సాయం చేస్తానని చెబితేనే.. ఇంట్లోకి రానిచ్చామని తెలిపారు. చివరకు తమ అమ్మనే పొట్టన పెట్టుకున్నాడని పేర్కొన్నారు.
విశాఖలో 151 మంది చిన్నారులు అదృశ్యం అయ్యారని తెలిపారు. ఏపీలో హ్యుమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని నోబెల్ గ్రహీత చెప్పారని వివిరంచారు. విశాఖలో పవన్ కల్యాణ్‌కేనా.. మిగతా వారికి లేవా అని అడిగారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన పార్టీ బాధ్యత అన్నారు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం ఎన్వోసీ కావాలి.. వాలంటీర్ ఉద్యోగానికి ఏమీ అవసరం లేదన్నారు. ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు.. పోలీసుల చేతులు కట్టేస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు.