»Ap Minister Amarnath Reddy Comments On Janasena President Pawan Kalyan
Amarnath Reddy: కేంద్రానికి కాదు..రష్యా, అమెరికా అధ్యక్షులకు చెప్పుకో
మరోసారి మంత్రి అమర్నాథ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఏం అనట్లేదని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఏదైనా అంటే చిన్నాపిల్లలు మారం చేసినట్లు కేంద్రానికి చెబుతా అంటారని ఎద్దేవా చేశారు.
AP Minister Amarnath Reddy Comments on Janasena President Pawan Kalyan
Amarnath Reddy: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) రిషికొండ(Rishionda) పర్యటన చేపట్టిన సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగు దేశం(TDP) పార్టీకి సంబంధించిన చాలా మంది వ్యక్తులు అవినీతికి పాల్పడినా మాట్లాడని పవన్ కల్యాణ్..ఈరోజు రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ(YCP) నాయకుల మీద లేనిపోని బురద చల్లి చంద్రబాబుకు మేలు చేద్దామని పవన్ అనుకుంటున్నారని..అలాంటి దోరణి మార్చుకోవాలన్నారు. ఇదంతా చేసేది కేవలం ప్యాకెజీ కోసమే అని క్లియర్‌గా అర్థం అవుతుందని అమర్ నాథ్ తెలిపారు. చిన్నా పిల్లాడు మారం చేసినట్లు ఏదైనా అంటే కేంద్రానికి చెబుతా అని బెదిరిస్తాడని వెల్లడించారు.
పలుకుబడితో పవన్ కల్యాణ్ కేంద్రంతో మాట్లాడుతా లేడు, చంద్రబాబు ఇస్తున్న రాబడితో మాట్లాడుతున్నాడని తెలిపారు. అయినా కేంద్రానికి ఏం చెబుతావు? వైసీపీ నాయకులు ఏమన్నా అక్రమాలు చేశారా? రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేసే జగన్ గురించి ఏమని చెబుతావని ప్రశ్నించారు. దేశంలో సీఎం జగన్‌ను చూసి చాలా రాష్ట్రాల సీఎంలు నేర్చుకోవాలన్నారు. కేంద్రంలో 37 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఎదిరించిన మొనగాడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. కేంద్రానికే కాదు అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధినేత పుతిన్‌లకు చెప్పినా తాము భయపడేది లేదని అమర్ నాథ్ స్పష్టం చేశారు.