ఏపీ పాలిటిక్స్ (Ap Politics)లో ఇప్పుడున్న కీలక నేతల్లో వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) కూడా ఒకరు. పొలిటికల్ లీడర్ అయిన రాధా ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. త్వరలోనే వంగవీటి రాధా పెళ్లి జరగనుంది. ప్రస్తుతం ఈ వార్త ఆయన అభిమానులకు ఎంతో సంతోషాన్నిస్తోంది. అయితే రాధా పెళ్లి చేసుకునేది ఎవరిని అనే ఉత్కంఠ అందరిలో ఉంది. నరసాపురం మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ జక్కం అమ్మాణి, బాబ్జిల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీని వంగవీటి రాధాకృష్ణ వివాహమాడనున్నారు.
ఆగస్టు 19వ తేదిన నర్సాపురంలో నిశ్చితార్థం జరగనుండగా సెప్టెంబర్ 6వ తేదిన పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇకపై రాధాకృష్ణ పెళ్లిచేసుకోరని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆయన పెళ్లి వార్త విని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2004లో వంగవీటి రాధా ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి ఆయన పాలిటిక్స్‌లో యాక్టీవ్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలుస్తానని ఆయన ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి ఆయన విజయవాడ సెంట్రల్ (Vijayawada central) తరపున పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయనకు సీట్ వస్తుందో? రాదోననే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
పాలిటిక్స్(Politics)లో పడి ఆయన ఇప్పటి వరకూ పెళ్లి గురించే మర్చిపోయారు. ఆఖరికి ఇప్పుడు ఓ తోడు కోరుకోగా నిశ్చితార్థ ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక ఉంటుందని తెలుస్తోంది. శనివారం నిశ్చితార్థం అయ్యాక సెప్టెంబర్ 6న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ పెళ్లి (marriage) వార్తతో ఇప్పుడు టీడీపీ (TDP) వర్గాలు, అభిమానుల్లో ఆనందకర వాతావరణం నెలకొంది.