»Ttd Chairman Karunakar Reddy Respond On The Trolls Distributing The Sticks
TTD chairman: కర్రల పంపిణీ ట్రోల్స్ పై..టీటీడీ ఛైర్మన్ ఏమన్నారంటే
తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రత కోసం కర్రలు ఇస్తామని ప్రకటించిన నిర్ణయంపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) స్పందించారు. వాటిలో నిజం లేదని అన్నారు. భక్తుల భద్రత కోసం తాము ఖర్చు విషయంలో వెనుకాడబోమని అన్నారు.
TTD chairman karunakar reddy respond on the trolls distributing the sticks
తిరుమలకు నడకదారిలో వెళ్లే ప్రతి భక్తుడికి వాకింగ్ స్టిక్ అందజేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) ఇప్పటికే తెలిపారు. జంతువులు దాడి చేస్తే కర్రతో రక్షించుకోవాలని, కొట్టాలన్నారు. చేతిలో కర్ర ఉంటే జంతువులు భయపడతాయని.. ఆత్మ రక్షణ కోసం… అలిపిరి మార్గం నుంచి తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికి కర్ర ఇస్తానని సంచలన ప్రకటన చేశాడు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పిల్లలను నడకదారిలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిల్లలను నడకదారిలోకి అనుమతించబోమని వెల్లడించారు.
ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్(trolls) రావడం మొదలయ్యాయి. అంతేకాదు జూ పార్క్ నుంచి చిరుతలు తెచ్చి వదలుతున్నారని పలువురు కామెంట్లు చేశారు. అయితే ఈ ట్రోల్స్ పై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. అటవీ అధికారుల సూచన మేరకే తాము కర్రలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. చిరుత సంచారం నిఘా కోసం ఇప్పటికే కెమెరాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అంతేకాదు డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని ఛైర్మన్ తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో నిజం లేదని కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
దీంతోపాటు నడకదారిలో వన్యప్రాణుల ఔట్ పోస్టును ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ(TTD) చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. వన్యప్రాణులకు ఆహారం అందించవద్దని ఆయన భక్తులకు సూచించారు. భక్తుల భద్రత కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. హోటల్ నిర్వాహకులు వాక్వేపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్దేశిత సమయాల్లో మాత్రమే ద్విచక్ర వాహనాలను కొండ ఎక్కేందుకు అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. సర్వదర్శనం భక్తులు నడవాలనే నిబంధనను తొలగిస్తున్నామన్నారు. భక్తులకు భద్రతపై అవగాహన కల్పిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వివరించారు.