మీ చుట్టూ మీకన్నా ఉన్నత లక్ష్యాలున్నవారే ఉండేలా చూసుకోండి. ఆశయాన్ని సాధించాలన్న తపన ఓ మంచి వైరస్ లాంటిది. అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ, కొండను సైతం ఢీకొట్టగలమన్న ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది. ఏ ఆశయమూ లేనివారితో, పెద్ద లక్ష్యాలపై గురిపెట్టడానికి భయపడేవారితో గడుపుతుంటే మీకు తెలియకుండానే మీలో ఆత్మవిశ్వసం సన్నగిల్లుతుంది. దీనివల్ల సవాళ్లను స్వీకరించడానికి సిద్ధపడరు.