»Huma Qureshi Body Shamed By A Reviewer Said She Is 5 Kgs Too Heavy To Be A Heroine
Huma Qureshi: 5 కేజీలు పెరిగావు అన్నారు బాధేసింది!
ఓ బాలీవుడ్ హీరోయిన్ గురించి ఒక రివ్యూవర్ 5 కేజీలు పెరిగావని కామెంట్ చేశారని, అందుకు ఆమె బాధపడినట్లు పేర్కొన్నారు. అయితే సినిమాను బట్టి బరువు పెరగడం, తగ్గడం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
Huma Qureshi Body Shamed by A reviewer. Said She Is 5 Kgs Too Heavy To Be A Heroine
Huma Qureshi: సెలబ్రెటీలు(Celebrities) కూడా సాధారణ ప్రజల్లానే ఆలోచిస్తారు. ట్రోల్స్(Trolls) నుంచి తప్పించుకోవాలని ఆరాటపడతుంటారు. తాము సినిమాల్లో ఎలా నటించినా సమాజంలో మాత్రం గౌరవం కోరుకుంటారు. అందుకనే వీలయినంత జాగ్రత్త పడుతుంటారు. అయినా సరే కొంత మంది నెగిటివ్ పబ్లిసిటిని మూటగట్టుకుంటారు. ఇప్పుడే ఇదే విషయంలో బాధ పడుతుంది హూమా ఖురేషి(Huma Qureshi). గ్యాంగ్స్ ఆఫ్ వస్సాపూర్ అనే ఫ్రాంచైజీ చిత్రాల ద్వారా సిల్వర్ స్క్రీన్కు పరిచయం అయిన ఈ ఢిల్లీ మోడల్ తరువాత వరుస సినిమాలతో బిజీ అయింది. తాజాగా జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా విడుదలైన తార్లా(Tarla) చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రంలో తన యాక్టింగ్ చాలా బాగుందన్న వార్తలు వచ్చాయి. ఇక పోతే తాజాగా ఓ హిందీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన హూమా సినిమాలో తన గురించి ఓ రివ్యూవర్ చెప్పిన మాటలకు బాధ పడిందంట.
సినిమా బాగుందా లేదా అనేది ప్రేక్షకుల వ్యక్తిగతమైన వ్యవహారం కానీ కొందరు కావాలని ట్రోల్స్ చేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాలో సాధారణ హీరోయిన్లు ఉండాల్సిన దాని కన్నా 5 కేజీలు ఎక్కువ బరువు ఉన్నావని( 5Kgs Too Heavy To Be A Heroine) ఒక రివ్వూవర్ అన్నారు. ఆ మాటలు తనను ఎంతగానో బాధించాయని తెలిపింది. సినిమాలో పాత్రను బట్టి తమ శరీరాలను మలుచుకుంటామని అది తెలియకుండా మాట్లాడితే వారికి ఏం చెబుతామని ఆమె అన్నారు. తమకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని వెల్లడించారు.