రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ నేడు తన పుట్టినరోజు నాడే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని మోడీ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలుస్తుందని సీఎం జగన్ అన్న సంగతి తెలిసిందే. ఓటమి భయం కారణంగానే ఇలా అంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
తెలంగాణ ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రిలో చేర్చారు. విరామం లేకుండా ఎన్నికల ప్రచారం చేయడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలుస్తోంది.
సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్నమయ్యలో నిరసన శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యే అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యోగాలు పోతాయంటూ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశాారు. రాష్ట్రం విభజన జరిగే సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కేంద్రం హమీ ఇచ్చిందని తెలిపారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్రానికి వారు చేసింది ఏమి లేదని.. దేశంలోనే వెనబడేలా చేశారని నూతన ఆర్థిక శాఖమంత్రి భట్టి మల్లు విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు ప్రారంభించామని రాబోయో రోజుల్లో మిగిలిన గ్యారంటీలను అమలుపరస్తామని అన్నారు.
అనకాపల్లిలో రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగం సంఘ అధ్వర్యంలో నిన్న జరిగిన ఆత్మ గౌరవసభలో.. సీపీఎస్ ఉద్యోగులు జగన్ నువ్వు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. జగన్ ఇచ్చిన హామీ మరిచారని మరోసారి పలు రకాలుగా ఆందోళన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఉన్న 54 కార్పొరేషన్లను(corporations) రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. దీంతో ఆయా కార్పొరేషన్ల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు పదవులు తొలిగిపోయాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సీఎం ఎవరన్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. రాయ్‌పూర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. అయితే బీజేపీ నేతలు ఎక్కువగా విష్ణు దేవ్ సాయి వైపే మొగ్గుచూపారు.