»Mallu Bhatti Vikramarka Was Angry With The Previous Brs Regime
Mallu Bhatti Vikramarka: బీఆర్ఎస్ పాలన అంతా అస్తవ్యస్తమే..త్వరలో రాష్ట్ర పరిస్థితిపై శ్వేతపత్రం
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్రానికి వారు చేసింది ఏమి లేదని.. దేశంలోనే వెనబడేలా చేశారని నూతన ఆర్థిక శాఖమంత్రి భట్టి మల్లు విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు ప్రారంభించామని రాబోయో రోజుల్లో మిగిలిన గ్యారంటీలను అమలుపరస్తామని అన్నారు.
Mallu Bhatti Vikramarka was angry with the previous BRS regime
Mallu Bhatti Vikramarka: తెలంగాణ ప్రజల కష్టాలను దూరం చేయడానికే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పడిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy) సమక్షంలో 11 మంది మంత్రులు ప్రమాణశ్రీకారం చేశారు. అనంతరం వారి కార్యచరణలో నిమగ్నం అయ్యారు. మధిర నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే ఉన్నత పదవులు చేపట్టానని తెలిపారు. ఈ నేపథ్యంలో మధిర క్యాంపు కార్యలయంలో భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ది ఒక చారిత్రక విజయం అని గత పదేళ్లపాలనలో బీఆర్ఎస్(BRS) పాలన అస్తవ్యస్తందంగా ఉందని అన్నారు. త్వరలో దీనిపై శ్వేత పత్రాన్ని విడుదల చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని, లెక్కలు అన్ని గందరగోళంగా ఉన్నాయని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందని, అందుకే ఈ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారిని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ ప్రజల కోసమే పనిచేస్తుందని అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం శ్రీకారం చేసిన తరువాత మొదటి సంతకం ఆరు గ్యారంటీలపై పెట్టారని, తరువాత రెండు రోజుల్లోనే రెండు పథకాలను అమలపరిచామని తెలిపారు. మిగిలిన వాటిని కూడా వందరోజుల లోపు అమలులోకి వస్తాయని వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా, వారి సమస్యలను పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని అని పేర్కొన్నారు. ఐటీ, పరిశ్రమలు, సేవా రంగాలను ప్రోత్సహిస్తామని, ఆరు గ్యారంటీలకు వ్యారంటీ లేదన్న బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పేలా పరిపాలన ఉంటుందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.