SRPT: కోదాడ మున్సిపాలిటీలో రాజకీయం వేడెక్కింది. రిజర్వేషన్లు ప్రకటించడంతో పలు సర్వే సంస్థలు పట్టణంలో రంగ ప్రవేశం చేసి ఆశావాహులను చుట్టుముడుతున్నాయి. ఓటర్ల నాడి మాకు తెలుసు అంటూ నమ్మబలుకుతున్నాయి. పార్టీ టికెట్ల వేటలో ఉన్న అభ్యర్థులకు ఈ నివేదికలు ఆయుధాలుగా మారుతాయని ఆశ చూపుతున్నాయి.