GNTR: తెనాలి నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార వృత్తి నిర్వహణకు అడ్డుగా ఉన్నాడన్న కారణంతో హిమబిందు, క్రాంతి కిరణ్‌లు నాగూర్ వలి, జయంత్, రంగారావుతో కలిసి ఈ నెల 9వ తేదీ రాత్రి టీచర్స్ కాలనీలో ఫయాజ్ అహ్మద్‌ను దారుణంగా కొట్టి చంపారని త్రీ టౌన్ సీఐ సాంబశివరావు తెలిపారు.