కోనసీమ: అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 21న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి వసంత లక్ష్మి సోమవారం తెలిపారు. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఉదయం 10:30 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటా, ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆమె కోరారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.