ప్రకాశం జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. పండగల్లో మద్యం ప్రియులు తమ సత్తా చూపారు. 14వ తేదీ ఒక్కరోజే రూ. 5.82 కోట్ల విలువైన మద్యం గోడౌన్ నుంచి షాపులకు తరలింది. 15, 16వ తేదీల్లో గోడౌన్లకు సెలవు కావడంతో ముందుగా మద్యం షాపుల ఓనర్లు భారీగా మద్యం తీసుకువచ్చారు. ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సుమారు రూ. 23 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారుల సమాచారం.