KRNL: కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో డీఐజీ కమ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఇవాళ PGRS కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమానికి 93 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.