AP: పల్నాడు జిల్లా వినుకొండ RTC బస్టాండ్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సంక్రాంతి పండగ సెలవులు పూర్తి కావటంతో బస్టాండులో రద్దీ నెలకొంది. ఈ క్రమంలోనే విజయవాడకు వెళ్లే బస్సు రాగా.. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీపడటంతో ఈ తొక్కిసలాట జరిగింది.