బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను అధికారికంగా నియమించారు. లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు వ్యూహాత్మక ఎత్తుగడను ఉద్ఘాటిస్తూ ఈ ప్రకటన చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జారిపడటం వల్ల తుంటి ఎముక విరగడంతో.. ప్రస్తుతం ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనను పరామర్శించనున్నారు.
ఆర్మూర్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అహంకారానికి కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ది చెబుతుందని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీకి బకాయిగా ఉన్న దాదాపు 8 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఏపీలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. శనివారం జమ్ములపాలెంలో పర్యటించిన క్రమంలో చంద్రబాబు తుపాను బాధిత రైతుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాలను నిన్న పర్యటించారు. పంట నష్టపోయి రైతులు కష్టాల్లో ఉంటే సీఎం బాధ్యతరహితంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని జగన్‌పై మండిపడ్డారు.
తుపాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పరోక్షంగా స్పందించారు. అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశామని అన్నారు.
క్యాష్ ఫర్ క్వశ్చన్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయబడింది. మహువా మొయిత్రాను పార్లమెంటు నుంచి బహిష్కరిస్తూ ఎన్డీయే తీసుకొచ్చిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ, జనసేన పొత్తు తప్పనిసరని అన్నారు.
తెలంగాణలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా ఆరోగ్య శ్రీ స్కీం పరిధిని రూ.10 లక్షలకు పెంచుతున్న హామీలు డిసెంబర్ 9 నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(duddilla sridhar babu) ప్రకటించారు. ఉచిత కరెంట్ అంశం గురించి రేపు రేవంత్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
తాను ఓట్ల కోసం రాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు కోసం వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ(visakhapatnam)లోని ఎస్ రాజా గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న క్రమంలో పేర్కొన్నారు.