»We Are Not A Bi Party For Anyone Pawan Kalyan Said At Visakhapatnam
Pawan kalyan: మేం ఎవరికీ బీ పార్టీ కాదు..సీఎం సీటుపై పవన్ కీలక వ్యాఖ్యలు
తాను ఓట్ల కోసం రాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు కోసం వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ(visakhapatnam)లోని ఎస్ రాజా గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న క్రమంలో పేర్కొన్నారు.
We are not a BI party for anyone Pawan kalyan said at visakhapatnam
తెలుగు వారిలో మా ఆంధ్రా అనే భావన విశాఖలోనే మొదలైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ(visakhapatnam)లోనే ప్రారంభమైందని చెప్పారు. అంతేకాదు తాను జీవితంలో ఎన్నో అపజయాలు చూసినట్లు ప్రస్తావించారు. ఈ క్రమంలో ఏం జరిగినా కూడా జనసేన పార్టీని మరో పార్టీలో విలీనం చేయబోమని స్పష్టం చేశారు. విశాఖలోని ఎస్.రాజా గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగసభలో పవన్ కల్యాణ్ ఈ మేరకు పేర్కొన్నారు. ప్రత్యేకంగా తాను ఒక ఎన్నికల కోసం ఆలోచించలేదని.. ఒక తరం కోసం ఆలోచించినట్లు చెప్పారు. ఈతరాన్ని కాపాడుకుంటూ వచ్చే తరం కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను ఓట్ల కోసం రాలేదని..మార్పు కోసం వచ్చానని అన్నారు. అధికారం కోసం ఓట్లు అడగను. మార్పు కోసం ఓట్ల అడుగుతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర తనకు చాలా ప్రియమైన ప్రాంతమని పవన్ అన్నారు. ఇక్కడి ప్రజలకు చాలా చైతన్యం ఉంటుందని చెప్పారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇక్కడి యువత ఎక్కువగా జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళుతున్నట్లు ప్రస్తావించారు. ఈ ఐదేళ్లు యువతకు ఎంత విలువైన కాలామో మీకు తెలుసా అంటూ అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాంటి అనేక మంది యువత భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని పవన్ ఆరోపించారు. కనీసం ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా అమలు చేశారా అని పవన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి క్రమంలో ఉత్తరాంధ్రలో యువత వలసలు ఆగాలని అన్నారు. ఇక్కడే ఉపాధి(jobs) అవకాశాలు సృష్టించాలి. కష్టం వస్తే ఆదుకుంటామని ఇప్పటికే జాలర్లకు చెప్పినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాను పదవుల కోసం ఎప్పుడు ఆలోచించలేదన్నారు. మీ ప్రేమ, అభిమానంతోనే జనసేన పార్టీని నడుపుతున్నట్లు చెప్పారు. ఏ అధికారంలో లేని నేనే ఇంత చేస్తుంటే..అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎంత చేయాలని ప్రశ్నించారు.