Nirmala Seetharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఆరో బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న విడుదల చేయనున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు ఉండవని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత, కొత్త ప్రభుత్వం జులైలో 2024-2025 ఆర్థిక సంత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని మంత్రి ఫోరమ్‌లో తెలిపారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేవరకు ప్రభుత్వ వ్యయాల అవసరాల కోసమే ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడతాం. అందుకే ఎలాంటి అద్భుతమైన ప్రకటనలేవీ ఉండవని తెలిపారు.
2019 ఎన్నికల సమయంలో అరుణ్ జైట్లీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలు చేపట్టిన పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. తర్వాత మళ్లీ నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి రావడంతో ఆర్థిక మంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్ మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం ఎన్నో విజయాలను సాధించింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో వృద్ధి చాలా ఎక్కువగా నమోదైంది. 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ.. ఎనిమిదేళ్లలో అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.