KTR: సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చారని ఆరోపించారు. రేవంత్ ఇచ్చిన ప్రతి హామీకి.. చెప్పిన ప్రతి మాటకు రికార్డు ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. నాలుగు వేలు పెన్షన్, పది రోజులు ఆగండి 15 వేలు రైతు భరోసా ఇస్తాం అన్నారు. ఇవ్వలేదని విమర్శించారు. మొదటి కేబినెట్లో ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పిస్తాం అన్నారు.. మరి ఏమైందని ప్రశ్నించారు.
ఎవరైనా అధికారంలోకి రాకముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారని.. కానీ వీళ్లు మాత్రం ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారని ధ్వజమెత్తారు. మేం చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు. ప్రతి ఏడాది కాగ్ రిపోర్ట్స్తోపాటు శ్వేత పత్రం కూడా విడుదల చేశామని తెలిపారు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు ఆ బరువు తెలియాలని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉంది అసలు ఆట అని విమర్శలు గుప్పించారు.