Kalyanram: టీజర్ వస్తోంది.. ‘దేవర’లో కొత్త ప్రపంచం చూస్తారు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం దేవర టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ దేవర టీజర్‌తో పాటు..అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.
ట్రిపుల్ ఆర్ తర్వాత.. ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్‌తో చేస్తున్న మూవీ కావడంతో.. దేవర పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. దేవర పార్ట్ వన్ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. జనవరి థర్డ్ వీక్‌లో దేవర షూటింగ్ పూర్తి కానుంది. త్వరలోనే దేవర గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇదే విషయాన్ని నందమూరి కళ్యాణ్ రామ్(kalyanram) కన్ఫామ్ చేశాడు.
దేవర(devara) నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ తన లేటెస్ట్ ఫిల్మ్ డెవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దేవర గురించి చెప్పుకొచ్చాడు. ‘అప్డేట్స్ గురించి వద్దని..మొన్న తమ్ముడు కూడా చెప్పాడు. కానీ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తరువాత సినిమా చేయాలంటే ఒక హీరో, డైరెక్టర్ లేదా ప్రొడక్షన్ హౌస్‌కి చాలా బాధ్యత ఉంటుంది. ఒక చిన్న అప్డేట్లో కూడా తేడా ఉంటే మీరు ఊరుకుంటారా? మీకు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చే ముందు మేము ఎంత ఆలోచించాలి? ఇంతకన్నా ఎక్కువ ఆలోచించాలి.. అని అన్నారు. త్వరలోనే దేవర గ్లింప్స్ రాబోతోంది, వీఎఫ్ఎక్స్కి చాలా టైం పడుతుంది. దేవరలో ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం.. అందుకే కాస్త టైం పడుతుంది.
ఈ లెక్కన దేవరను ఎంత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్(jrntr) కెరీర్ తీసుకుంటే ట్రిపుల్ ఆర్ తర్వాత అంతకుముందు అనే చెప్పాలి. ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు తారక్. అందుకే.. దేవరను భారీ బడ్జెట్‌తో హైయ్యర్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ టీమ్ వర్క్ చేస్తోంది. మరి దేవర విజువల్ వండర్‌గా ఎలా ఉంటుందో చూడాలి.