అదానీ ఎదుగుదలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని, ఆయన కోసం నిబంధనలు కూడా మార్చారని ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అదానీ వ్యవహారం గత కొద్దిరోజులుగా హాట్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ అంశంపై సభలో మాట్లాడారు. మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే తక్కువకాలంలో ప్రపంచ కుబేరుడయ్యాడని ఆరోపించాడు. దీనిపై బీజేపీ నేత రవిశంకర ప్రసాద్ ఘాటుగా ...
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. ముఖ్య నేతలు మాత్రం పాదయాత్ర బాట పట్టారు. బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తామని అంటోంది. ఇటు టీడీపీతో కూడా జనసేన సఖ్యంగానే ఉంటుంది. దీంతో ఏ ఏ పార్టీ కలిసి పోటీ చేస్తుందనే అంశంపై స్పష్టత లేదు. ఇదే విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. జనసేనతో కలిసి పోటీ చేస్తామని అంటున్నారు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు. కర్నూలు జిల్లా ఎ...
తెలంగాణ మంత్రి కేటీఆర్ కి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ఇవ్వడం లేదంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తాను చేయాల్సిన పనులను చేయకుండా కేంద్రంపై తరచూ విమర్వలు చేస్తోందని మండిపడ్డారు. ఐటీఐఆర్ పై బహిరంగ చర్చకు రావాలంటూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఐటీఐఆర్ పై కేసీఆర్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. ఐటీఐఆర్ ను 2 విడతల...
బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించి వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. కాగా… ఈ ఘటన పట్ల ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా 2001లో గుజరాత్ లో జరిగిన భూకంపాన్ని తలుచుకొని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ తివ...
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. అన్నం పెట్టేవారికి సున్నం పెడుతున్నారని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోవద్దన్నారు. దామరచర్ల మండలం నర్సాపూర్‌లో అభివృద్ధి పనులకు ఈరోజు శ్రీకారం చుట్టారు. అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మర్యాదగా ఉన్నంత వరకే ఉంటనని హెచ్చరించారు. మర్యాద తప్పితే డ్యాన్స్ చేయిస్తా...
మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్…చాలా కాలం తర్వాత వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు సంబంధించిన ఓ ఆడియో… ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఆడియోలో ఆయన తన సొంత పార్టీకి చెందిన కార్యకర్తను బూతులు తిట్టడం గమనార్హం. ఆ తిట్టే క్రమమంలో ఆయన బండి సంజయ్ పై కూడా విమర్శలు చేయడం గమనార్హం. బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫోన్ లో ఓ బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయారు బాబూమోహన్. దీంతో… ఆయనపై విమర్శలు [&he...
విశాఖ నచ్చితే వీకెండ్ వెళ్లాలని సీఎం జగన్‌కు రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సూచించారు. ఇటీవల విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని జగన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో రఘురామ కృష్ణరాజు స్పందించారు. జగనన్న విశాఖ వెళతారనే చర్చ రాష్ట్రమంతా నడుస్తోందని అన్నారు. రాజు ఎక్కడుంటే అదే రాజధాని కాదని రఘురామ కామెంట్ చేశారు. రాజధానిపై సుప్రీంకోర్టు ...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలను అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి పంపవలసిన రూ. 689 కోట్ల రూపాయల నిధులు పెడింగ్‌లో ఉన్నాయని, ఆ సొమ్మును పరిహార నిధి నుంచి త్వరలోనే చెల్లిస్తామని కేంద్ర నిర్మలా సీతారామన్ హమీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్ల...
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సినీ నటి, బీజేపీ నేత జీవితా రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆమె బీజేపీలో చాలా చురుకుగా ప్రవర్తస్తున్నారు. ఆమధ్య మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకై నియోజకవర్గమంతటా కలియతిరిగి ప్రచారం చేసారు. కాగా… ప్రస్తుతం ఆమె ఎన్నికలో పోటీకి సై అంటున్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పోటీ చేస్తా అని ఆమె క్లారి...
తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని రోజా హెచ్చరించారు. కనీసం అర కిలోమీటర్ సక్రమంగా నడవలేక, వంకర టింకరగా నడిచే నువ్వు కూడా 3600 కిలోమీటర్లు నడిచిన జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజలకు నేరుగా అందుతున్నాయని, అభివృద్ధి కనిపిస్తోందన్నారు. అందుకే టీడీపీ ఈ మధ్య కొత్త రాగం అందుకున్నదని చెబుతున్నారన్నారు. మేం అధికారంలోకి వచ్చినా ...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని బోరుగడ్డ అనిల్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు అనిల్ అని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కోటంరెడ్డికి అనిల్ ఫోన్ చేసి బెదిరించిన సంగతి తెలిసిందే. నెల్లూరు సెంటర్‌లో వాహనానికి కట్టుకొని ఈడ్చుకెళతా అని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు తనకు కోటంరెడ్డి నుంచి లైఫ్ థ్రెట్ ఉందని అంటున్నారు. గుంటూర...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. పిటిషన్ వెంటనే విచారణకు స్వీకరించాలని న్యాయవాది దుష్యంత్ దవే కరోరారు. కేసును సీబీఐకి అప్పగిస్తే సాక్ష్యాలు ధ్వంసమవుతాయని పేర్కొన్నారు. అయిత...
రైతులకు పెట్టుబడి సాయంగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచుతారని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేల చొప్పున కేంద్రం పెట్టుబడి సాయంగా ఇస్తోంది రైతుకు. రూ.2వేల చొప్పున మూడు దఫాలుగా ఏడాదికి ఆరువేల మొత్తాన్ని అందిస్తోంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి మరో రెండువేల రూపాయలు అదనంగా ఇస్తా...
ఓటమికి కారణం, గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ పైన పల్లా స్పందించారు. 2019లో చంద్రబాబు ప్రచారానికి రాకపోవడం వల్లే తాను ఓడిపోయానని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్‌కు టీడీపీ పరోక్షంగా మద్దతిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగిందని గుర్తు చేశారు. కానీ తాను మాత్రం తన గెలుపు కోసమే పోరాడినట్లు చెప్పారు. జనసేనాని మరోసారి అంటే 2024లో తిరిగి గాజువాక నుండి పోటీ చేస్తారని తాను అయితే భా...
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముసలం చోటు చేసుకుంది. పార్టీ అత్యంత కీలక నేత తన పదవికి రాజీనామా చేసి, అధిష్టానానికి షాకిచ్చారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత బాలాసాహెబ్ థోరట్ మంగళవారం ఆ పదవికి రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని, ఆయనతో కలిసి తాను పని చేయలేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం లేఖ రాసిన విషయం వెలుగు చ...