ఓటమికి కారణం, గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ పైన పల్లా స్పందించారు. 2019లో చంద్రబాబు ప్రచారానికి రాకపోవడం వల్లే తాను ఓడిపోయానని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్‌కు టీడీపీ పరోక్షంగా మద్దతిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగిందని గుర్తు చేశారు. కానీ తాను మాత్రం తన గెలుపు కోసమే పోరాడినట్లు చెప్పారు. జనసేనాని మరోసారి అంటే 2024లో తిరిగి గాజువాక నుండి పోటీ చేస్తారని తాను అయితే భావించడం లేదన్నారు. ఈసారి సీటును త్యాగం చేయవలసి వచ్చే పరిస్థితుల్లోను అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. మేం పార్టీకి కట్టుబడి ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండి, టిక్కెట్ ఇస్తే కనుక తాను ఒక్క క్షణం కూడా ఆలోచించేది లేదన్నారు. తనకు స్థానిక సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీగా పోటీ చేసే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. గాజువాకలో కాకుండా మరో నియోజకవర్గంలోను టిక్కెట్ ఇస్తారనే ఆలోచన తనకు లేదన్నారు.