నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని బోరుగడ్డ అనిల్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు అనిల్ అని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కోటంరెడ్డికి అనిల్ ఫోన్ చేసి బెదిరించిన సంగతి తెలిసిందే. నెల్లూరు సెంటర్లో వాహనానికి కట్టుకొని ఈడ్చుకెళతా అని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు తనకు కోటంరెడ్డి నుంచి లైఫ్ థ్రెట్ ఉందని అంటున్నారు. గుంటూరు డొంకరోడ్డులో గల అనిల్ కార్యాలయాన్ని సోమవారం రాత్రి దుండగులు తగులబెట్టారు. ఆ ఆఫీసును అనిల్ ఈ రోజు పరిశీలించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తాను సవాల్ విసిరానని.. అందుకే తన ఆఫీసు తగులబెట్టారని చెప్పారు. వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. ఇందులో టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
కార్యాలయానికి నిప్పు..
కోటంరెడ్డికి అనిల్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆయన కార్యాలయం తగులబడింది. ఇది ప్రమాదం కాదని అనిల్ అంటున్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆరోపించారు. కోటంరెడ్డి శ్రీధర్ ప్రోద్బలంతో ఘటన జరిగిందని చెప్పారు. ఆయన నుంచి తనకు ప్రాణహానీ ఉందని పేర్కొన్నారు. రక్షణ ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు. తన కార్యాలయానికి నిప్పు అంటించిన ఘటనలో టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు పాత్ర కూడా ఉందని బోరుగడ్డ అనిల్ ఆరోపించారు.
జగన్ అని పిలువడంతో..
ఫోన్ ట్యాపింగ్ చేశారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ పేరు ప్రస్తావించారు. జగన్ తాత, తండ్రి వద్ద కూడా పనిచేశానని చెప్పారు. జగన్ను ఏకవచనంతో మాట్లాడారని అనిల్ ఫోన్ చేశారు. ఆయనే రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ మరుసటి రోజు శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అనిల్, సజ్జల రామకృష్ణారెడ్డికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. తాను ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతానని చెప్పారు. వాష్ రూం వెళ్లినా, స్నానం చేసే సమయంలో లిప్ట్ చేయనని.. ఆ తర్వాత కాల్ చేస్తానని చెప్పారు. సమస్యల కోసం చేసి ఉంటారని బ్క్యా కాల్ చేస్తానని.. అలా ఫోన్ చేయగా అనిల్ కాల్ కలిసిందని చెప్పారు. తనది ఐ ఫోన్ అని వాయిస్ రికార్డ్ కాదని చెప్పారు. వారే రికార్డ్ చేసి, పంపించారని తెలిపారు.
టీడీపీలో చేరతా
రాజకీయంగా నిర్ణయం తీసుకున్నానని.. టీడీపీలో చేరతానని కోటంరెడ్డి చెబుతున్నారు. వైసీపీపై రాజీ లేకుండా పోరాడుతానని పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి లక్ష్యంగా కూడా విమర్శలు చేశారు. సజ్జలను తిడితే కాకాణికి కోపం వస్తుందని చెప్పారు. మొదట్లో తనకు కూడా అర్థం కాలేదని.. కానీ ఆయనకు మంత్రి పదవీ ఇప్పించిందే సజ్జల అని తర్వాత బోధపడిందన్నారు. అందుకే సజ్జలను ఒక మాట అననీయరని పేర్కొన్నారు. తన గన్ మెన్లను కూడా తగ్గించారని.. అందుకే మరో ఇద్దరిని తాను పంపిస్తున్నానని కోటంరెడ్డి తెలిపారు. మీడియా ముందు గన్ మెన్లు ఇద్దరు కంటతడి పెట్టుకున్నారు. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.