మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. అన్నం పెట్టేవారికి సున్నం పెడుతున్నారని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోవద్దన్నారు. దామరచర్ల మండలం నర్సాపూర్‌లో అభివృద్ధి పనులకు ఈరోజు శ్రీకారం చుట్టారు. అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మర్యాదగా ఉన్నంత వరకే ఉంటనని హెచ్చరించారు. మర్యాద తప్పితే డ్యాన్స్ చేయిస్తానని హెచ్చరించారు. తన సంగతి మీకు తెలియదు అని మందలించారు. ఎమ్మెల్యే కామెంట్స్‌తో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎందుకు ఇలా మాట్లాడారు అనే చర్చ వచ్చింది.
ఎమ్మెల్యే భాస్కర్ రావు తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు. జనాలను డ్యాన్స్ చేయిస్తా అనడం ఏంటీ అని విమర్శిస్తున్నారు. స్థానికులు కూడా ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు. తమపై ఎమ్మెల్యే ప్రతాపం చూపించడం ఏంటీ అని అడిగారు. ఓటు వేసి గెలిపిస్తే.. ఇలా చేస్తారా అని అడుతున్నారు. తిరిగి తమను బెదిరిస్తారా అంటున్నారు. సీఎం కేసీఆర్ వేసిన రోడ్లపై నడవొద్దా..? ప్రభుత్వ పథకాలు తీసుకోవద్దా అని ప్రశ్నించారు.