కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలను అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి పంపవలసిన రూ. 689 కోట్ల రూపాయల నిధులు పెడింగ్‌లో ఉన్నాయని, ఆ సొమ్మును పరిహార నిధి నుంచి త్వరలోనే చెల్లిస్తామని కేంద్ర నిర్మలా సీతారామన్ హమీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్లమెంట్లో ప్రస్తావించారు.
ఎంపీ బాలశౌరి ప్రశ్నలపై స్పందించిన నిర్మలా సీతారామన్ ఏపీకి కేంద్రం విడుదల చేయాల్సిన రూ. 1,268 కోట్ల రూపాయలు ఇప్పటికి పెండింగ్‌లో వున్నాయని బదులిచ్చారు. 2022 మే 31 వరకు అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని బ్యాక్ టు బ్యాక్ లోన్ ద్వారా క్లియర్ చేశామని ఆమె ప్రకటించారు. త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ కి చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు.