పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బృందం చర్చలు జరిపింది. పార్టీలోకి రావాలని కోరగా.. 10 సీట్లు ఇస్తేనే వస్తా అని పొంగులేటి స్పష్టంచేసినట్టు తెలిసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మార్పులు తిరుగుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఆయన తనయుడు, ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టవుతారనే వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ భయంతో బెయిల్ పిటిషన్ వేశారు.
వైయస్ భాస్కర రెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చారు. తొలుత చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన ఆ తర్వాత మాత్రం భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) దుర్మరణం చెందారు. కారు టైరు పేలిన ఘటనలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
కేసీఆర్ ఫ్యామిలీ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్(kcr) పలు రకాల ప్లాన్స్ అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. తాజాగా విశాఖ ప్లాంట్ విషయంలో కూడా అదే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కూడా సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని ప్రజలను తప్పుదొవ పట్టించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.