కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ ఇవ్వలేదనే విషయాన్ని చివరి వరకు దాచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను కలిసి తన రాజీనామా సమర్పించారు.
బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ(Telangana)లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేయిస్తాం. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే.. ఆయా ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయిస్తాం. త్యాగాలకు, పోరాటాలకు నిలయమైన ఓరుగల్లు గడ్డ(Orugallu Gadda)పై నిరుద్యోగ మార్చ్ సాక్షిగా మాట ఇస్తున్నా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) ప్రకటించారు.
ఈడీ వస్తుందంటే కాలు విరుగుతుంది, సీబీఐ(CBI) వస్తుందంటే దుబాయి వెళ్తారు, ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్( Warangal) లో జరిగిన నిరుద్యోగ మార్చ్ (Unemployment march) లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు.
మెగా బ్రదర్ నాగబాబు(Naga babu)కి జనసేనలో కీలక పదవి దక్కిన సంగతి తెలిసిందే. ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ క్రమంలో... ఆయన పార్టీ విజయం కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తానంటూ పేర్కొన్నారు.
ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలులో ఉంటూనే లేఖలతో ప్రకంపనలు రేపుతున్నాడు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాట్‌కు సంబంధించి లేఖ విడుదల చేయగా.. ఇప్పుడు మరో లేఖ బయటకు వచ్చింది.
పార్టీ మారినందుకు గిరిజన మహిళల్ని గ్రామంలో కిలోమీటరు వరకూ సాస్టాంగ ప్రదక్షిణలు చేయించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ అసెంబ్లీలో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన రోజు తాను తర్వాతి స్థానంలో ఉంటానని తెలుసని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. మరోవైపు అబద్ధ సాక్ష్యాలు, కోర్టులలో తప్పుడు సాక్ష్యాలను అందించినందుకు తాను సీబీఐ, ఈడి అధికారులపై కేసులు నమోదు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు.
యేటా రూ.11 వేల కోట్ల బడ్జెట్ అంటూనే.. రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన. ఇది మీరు చెప్తు ఆరోగ్య తెలంగాణ కాదు.. ప్రజలు చూస్తున్న అనారోగ్య తెలంగాణ
పేదల్ని దోచుకుని వేల కోట్లు దాచుకుని దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం రిచ్ మోహన్ రెడ్డి..పేదలతో ప్రయాణం చేయడం అంటే వారికి అన్యాయం చేయడమా? అని నారా లోకేశ్ నిలదీశాడు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అనినాష్ ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలను తెలియజేసింది. వివేకా హత్య గురించి ఉదయ్‌కు ముందే తెలుసు అని పేర్కొంది.
సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్సార్ సీపీలో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పోరాటం చేయాల్సిందేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మేధావులు, నిర్వాసితులు, కార్మికులతో కలిసి ఉద్యమించాలని కోరారు.