»Yuvagalam Padayatra Nara Lokesh Renamed Ys Jagan Name As Rich Mohan
Rich Mohan జగన్ కు రిచ్ మోహన్ అంటూ కొత్త పేరు పెట్టిన లోకేశ్
పేదల్ని దోచుకుని వేల కోట్లు దాచుకుని దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం రిచ్ మోహన్ రెడ్డి..పేదలతో ప్రయాణం చేయడం అంటే వారికి అన్యాయం చేయడమా? అని నారా లోకేశ్ నిలదీశాడు.
దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) గుర్తింపు పొందడంపై టీడీపీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఛలోక్తులు విసిరారు. సీఎం పేరును లోకేశ్ మార్చేశారు. జగన్ మోహన్ ను కాస్త రిచ్ మోహన్ (Rich Mohan) అని లోకేశ్ నామకరణం చేశారు. పింఛన్ తొలగింపులపై తన యువగళం (Yuvagalam) పాదయాత్రలో నిలదీశారు. జగన్ పాలనలో 6 లక్షల మందికి పింఛన్లు తొలగించినట్లు (Pensions) ఆరోపించారు. వారితో సెల్ఫీ దిగు అని సవాల్ విసిరారు. తన యాత్రలో పింఛన్ తొలగింపుపై మొర పెట్టుకున్న మహిళతో కలిసి సెల్ఫీ దిగిన లోకేశ్ ట్విటర్ (Twitter)లో ప్రశ్నించారు.
‘పింఛన్ పీకేసిన 6 లక్షల మందితో సెల్ఫీ దిగు రిచ్ మోహన్! పేదల్ని దోచుకుని వేల కోట్లు దాచుకుని దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం రిచ్ మోహన్ రెడ్డి..పేదలతో ప్రయాణం చేయడం అంటే వారికి అన్యాయం చేయడమా? పెత్తందారులతో యుద్ధం అంటే రాష్ట్ర సంపద దోచిపెట్టిన వారితో వాటాల కోసం చేసే యుద్ధమా? ప్రతీ ఇంటికి మేలు చేశామని, ఆ ఇంటివారితో నిజమైన సెల్ఫీ దిగుతానని గొప్పగా చెప్పావు కదా రిచ్ మోహన్. బోరున విలపిస్తున్న ఆ వితంతువుతో వచ్చి సెల్ఫీ దిగు. ఎన్టీఆర్ భరోసా పింఛనుని, వైఎస్సార్ పెన్షన్ కానుకగా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం శభాష్పురం గ్రామంలో తలారి యంకమ్మ అనే వితంతువుకి రెండేళ్ల క్రితమే పింఛను తీసేశావు. పేరు మార్చావు. ఎన్నికలకి ముందు రూ.3 వేలుకి పెంచుతామన్న పింఛను నాలుగేళ్లయినా ఇంకా 3 వేలకి చేరలేదు. ఈ లోగానే తలారి యంకమ్మలాగే రాష్ట్రంలో 6 లక్షల మంది బతుకులకి భరోసా అయిన పెన్షన్ పీకేశావు. ఈ ఆరులక్షల మందితో సెల్ఫీలు దిగు రిచ్ మోహన్!’ అని ట్వీట్ చేశాడు.
కర్నూలు జిల్లా (Kurnool District) డోన్ (Dhone) నియోజకవర్గం పొలిమేరమెట్టలో శనివారం లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర 71వ రోజుకు చేరడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. డోన్ నియోజకవర్గంలో పాదయాత్ర ముగిసి పత్తికొండ (Pattikonda) నియోజకవర్గంలోకి ప్రవేశించింది. లోకేశ్ యాత్రకు టీడీపీ ఇన్ చార్జ్ కేఈ శ్యాంబాబు (KE Shyambabu) ఆహ్వానించారు. కాగా మొన్న ఏడీఆర్ అనే సంస్థ సీఎం జగన్ అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి అని నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే.
పేదల్ని దోచుకుని వేల కోట్లు దాచుకుని దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం రిచ్ మోహన్ రెడ్డి గారు..పేదలతో ప్రయాణం చేయడం అంటే వారికి అన్యాయం చేయడమా?(1/4) pic.twitter.com/ySLcea9jYg